
సాక్షి,అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి నియోజకవర్గం యాడికి పవర్ గ్రిడ్ సంస్థలో దౌర్జన్యం చేసిన జేసీ అనుచరులపై తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి కేసు నమోదు చేశారు.
దీంతో ఏఎస్పీ రోహిత్‌పై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ‘ఏఎస్పీ రోహిత్ ఓ అవినీతి అధికారి. నీపై ఫిర్యాదు చేస్తా.. కేసు పెడతా. నేను, నా కుటుంబ సభ్యులు నీకు వ్యతిరేకంగా పీఎస్ వద్ద ధర్నా చేస్తాం. వచ్చే బుధవారం రోజున నీతో తాడోపేడో తేల్చుకుంటా’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు.