మెరిసిన గ్రామీణ యువత
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన గ్రూప్–2 పరీక్షల్లో గ్రామీణ యువత మెరుగైన ఫలితాలు సాధించింది. ఫలితాలు బుధవారం విడుదల కాగా, పరిశీలించుకున్న పలువురిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. పట్టుదలతో ఉన్నతస్థాయి ఉద్యోగాన్ని దక్కించుకున్న చిరుద్యోగులు కొందరైతే... అదే స్థాయిలో నిరుద్యోగులు సైతం రాణించారు. లక్ష్య సాధనలో విజయ కేతనం ఎగురవేసిన అభ్యర్థులను గ్రామస్తులు అభినందనలతో ముంచెత్తారు.
● గ్రూప్–2 ఫలితాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలకు అర్హత
●పట్టుదలతో సాధించిన చిరుద్యోగులు
● అదే స్థాయిలో రాణించిన నిరుద్యోగులు


