●అధినేతతో భేటీ | - | Sakshi
Sakshi News home page

●అధినేతతో భేటీ

Jan 29 2026 6:26 AM | Updated on Jan 29 2026 6:26 AM

●అధిన

●అధినేతతో భేటీ

తాడేపల్లిలో బుధవారం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలసిన పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌గౌడ్‌.

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు : డీఆర్‌ఎం

గుంతకల్లు: రైలు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనే తమ ప్రథమ కర్తవ్యమని డీఆర్‌ఎం చంద్రశేఖర్‌ గుప్తా స్పష్టం చేశారు. బుధవారం స్థానిక డీఆర్‌ఎం కార్యాలయంలోని మీటింగ్‌ చాంబర్‌లో డివిజనల్‌ కన్సల్టివ్‌ కమిటీ (డీఆర్‌యూసీసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. రైలు ప్రయాణికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని, పలు రైల్వేస్టేషన్‌లో ఎత్తివేసిన స్టాపింగ్‌లను పునరుద్ధరించాలని కోరారు. కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ను ధర్మవరం, తాడిపత్రి, యర్రగుంట్ల, ప్రొద్దుటూరు, నంద్యాల మీదుగా మళ్లించాలని విన్నవించారు. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లల్లో జనరల్‌ బోగీల సంఖ్యను పెంచాలన్నారు. అనంతరం డీఆర్‌ఎం మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం సుధాకర్‌, సీనియర్‌ డీసీఎం మనోజ్‌, వివిధ విభాగాల అధికారులు, డీఆర్‌సీసీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

శేషవాహనంపై

రంగనాథుడు

గుత్తి రూరల్‌: మండలంలోని తొండపాడు వెలిసిన బొలికొండ రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శేష వాహనంపై దేవేరులతో కలసి భక్తులకు శ్రీవారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు పలుకూరి రవికుమార్‌, చేతన్‌వర్మ, లిఖిల్‌వర్మ, నవీన్‌కుమార్‌ ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథుడి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన శేషవాహనంపై గ్రామ శివారులోని జమ్మి చెట్టు వరకూ ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం హనుమద్‌ వాహన సేవ ఉంటుందని ఆలయ ఈఓ శోభ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది రామకృష్ణ, బాలు మోహన్‌ పాల్గొన్నారు.

రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి

అనంతపురం అర్బన్‌: రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించాలని ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ సి.విష్ణుచరణ్‌ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పౌర సరఫరాలు, రీసర్వే, తదితర అంశాలపై ఆయన బుధవారం కలెక్టరేట్‌ నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న చుక్కలు భూముల క్లెయిమ్‌ల పరిష్కారంపై దృషి సారించాలని చెప్పారు. ఇంటి స్థల, పొజిషన్‌ సర్టిఫికెట్‌లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ శాఖ ఈ సర్వీసులకు సంబంధించి బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏలో ఉన్న సమగ్ర కుల ధ్రువీకరణ పత్రాలపై విచారణ చేసి మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్‌ఓఆర్‌ చట్టం, అసైన్డ్‌ భూములకు సంబంధించి ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్సఫర్‌, భూ ఆక్రమణ చట్టానికి సంబంధించిన వివరాలను తహసీల్దార్లు, ఆర్డీఓ లాగిన్‌లలో అప్‌డేట్‌ చేయించాలని చెప్పారు. నాల్గవ దశలో 90 గ్రామాల్లో చేపట్టిన భూముల రీ–సర్వే పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. చౌక ధరల దుకాణాల ద్వారా ప్రజలకు సరుకులను డీలర్లు సక్రమంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తహసీల్దార్లు వారి పరిధిలోని గ్యాస్‌ ఏజెన్సీలను తనిఖీ చేయాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌ఓ మలోల, సర్వే శాఖ ఏడీ రూప్లానాయక్‌, పౌర సరఫరాల సంస్థ డీఎం రమేష్‌రెడ్డి, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, కలెక్టరేట్‌ కో–ఆర్డినేషన్‌, భూ విభాగం సూపరింటెండెంట్లు యుగేశ్వరిదేవి, రియాజుద్ధీన్‌, పరిష్కార వేదిక ఇన్‌చార్జ్‌ జయశ్రీ, ఈ–డిస్ట్రిక్‌ మేనేజర్‌ రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

●అధినేతతో భేటీ1
1/3

●అధినేతతో భేటీ

●అధినేతతో భేటీ2
2/3

●అధినేతతో భేటీ

●అధినేతతో భేటీ3
3/3

●అధినేతతో భేటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement