
వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘వీటీ 15’ (వర్కింగ్ టైటిల్). మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా తాజా షెడ్యూల్ అనంతపురంలో ముగిసినట్లు మేకర్స్ ప్రకటించారు.
‘‘ఇండో–కొరియన్ హారర్ కామెడీగా రూపొందుతోన్న చిత్రం ‘వీటీ 15’. అనంతపురంలో థ్రిల్లింగ్ సన్నివేశాలతోపాటు పంచ్ హ్యూమర్‌తో కూడిన సీన్స్ షూట్ చేశాం. వరుణ్ తేజ్, రితికా నాయక్‌పై పల్లెటూరి నేపథ్యంలో చిత్రీకరించిన సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయి. మా చిత్రం తర్వాతి షెడ్యూల్ కొరియాలో ప్రారంభం అవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.