జెడ్పీ చైర్మన్‌ చిచ్చు.. బీజేపీలో ఎమ్మెల్యే రాజీనామా హైడ్రామా! | BJP MLA Adinarayana reddy serious On Kadapa ZP Seat issue | Sakshi
Sakshi News home page

జెడ్పీ చైర్మన్‌ చిచ్చు.. బీజేపీలో ఎమ్మెల్యే రాజీనామా హైడ్రామా!

Nov 20 2026 1:33 PM | Updated on Nov 20 2026 1:36 PM

BJP MLA Adinarayana reddy serious On Kadapa ZP Seat issue

సాక్షి, విజయవాడ: కడప జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి కేటాయింపు వ్యవహారం బీజేపీలో రాజకీయ చిచ్చు రేపుతోంది. తమ కుటుంబానికి జెడ్పీ చైర్మన్‌ పదవి ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినా.. చివరకు ఆ పదవిని టీడీపీకే కేటాయించడంపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో నారా లోకేష్‌ తనకు వెన్నుపోటు పొడిచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారంటూ ప్రచారం సాగడంతో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.

ఈ వ్యవహారంపై విజయవాడలోని ఓ హోటల్‌లో బస చేసిన ఆదినారాయణ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ కలిశారు. హోటల్‌ మినర్వాలో ఆయనతో భేటీ అయి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆదినారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించడానికి ముందే మాధవ్‌ ఆయనతో సమావేశమయ్యారు. అంతకుముందు బీజేపీ నేత విష్ణుకుమార్‌ రాజు కూడా ఆదినారాయణ రెడ్డితో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే ఆయన వెళ్లిన 15 నిమిషాలకే మాధవ్‌ అక్కడికి చేరుకుని మరోసారి చర్చలు జరిపారు. కడప జెడ్పీ చైర్మన్‌ పదవిని బీజేపీకి కేటాయించకపోవడంపై ఆదినారాయణ రెడ్డి వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన తదుపరి నిర్ణయం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

Video Credit:  Telugu Feed 

ఇదీ చదవండి: తాడిపత్రిలో హైటెన్షన్‌.. పెద్దారెడ్డి ఇంటిపై దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement