పశ్చిమాసియా కల్లోలం.. కీలక పరిణామాలు | Iran War Live Updates March 26th | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

పశ్చిమాసియా కల్లోలం.. కీలక పరిణామాలు

చర్చల విషయంలో ఇరాన్‌ వింతగా ప్రవర్తిస్తోంది: ట్రంప్‌

  • ఓ వైపు ఒప్పందం కోసం ఇరాన్‌ మమ్మల్ని బతిమాలుకుంటుంది.
  • మరోవైపు బయటకు మాత్రం ఇరాన్‌ ఆ విషయాన్ని అంగీకరించడం లేదు
  • సమయం మించిపోకముందే వారు త్వరపడాలి
  • ఎందుకంటే ఒక్కసారి సమయం దాటిపోతే.. ఇక వెనక్కి తిరగడం ఉండదు

2026-03-26 16:58:37

రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం

  • రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం
  • సీఎంలతో వర్చువల్‌గా మాట్లాడనున్న మోదీ
  • పశ్చిమాసియా పరిస్థితులపై సీఎంలతో చర్చించనున్న మోదీ
     
2026-03-26 16:27:00

విశాఖ తీరానికి చేరుకున్న ఎల్‌పీజీ, చమురు నౌకలు

  • విశాఖకు ఎల్‌పీజీ గ్యాస్‌తో భారీ నౌకలు
  • గ్యాస్, ఆయిల్ ఇబ్బందుల వేళ ఉపశమనం
  • విశాఖ తీరానికి చేరుకున్న ఎల్‌పీజీ, చమురు నౌకలు
  • హార్బర్ మౌత్‌లో లంగరేసిన భారీ ఎల్‌పీజీ నౌక బిర్చ్
  • ఇప్పటికే విశాఖ పోర్టుకు చేరుకున్న ఎంటీ పెట్రాయిట్
  • భారీ నిల్వలలతో రావడంతో ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం
2026-03-26 16:13:42

ఐఆర్‌జీసీ నౌకాదళ అధిపతి అలీరెజా మృతి

  • ఇరాన్‌లోని బందర్ అబ్బాస్‌లో ఇజ్రాయెల్‌ దాడులు
  • ఐఆర్‌జీసీ నౌకాదళ అధిపతి అలీరెజా టాంగ్సిరి మృతి
  • మీడియాకు తెలిపిన ఇజ్రాయెల్ అధికారి 
  • హార్మూజ్ జలసంధి మూసివేతకు బాధ్యుడు అలీరెజా 
2026-03-26 14:35:24

ఓవైపు యుద్ధం.. మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు

  • ఓవైపు యుద్ధం.. మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు
  • గల్ఫ్ దేశాలను వణికిస్తున్న భారీ వర్షాలు
  • యూఏఈ సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్, ఇండోనేసియా, బ్రెజిల్లో భారీ వర్షాలు
  • భారీ వర్షాలతో స్తంభించిపోయిన జనజీవనం
  • ఏకధాటి వర్షాలతో వరదల్లో కొట్టుకుపోతున్న వాహనాలు
2026-03-26 11:21:16

గల్ఫ్ యుద్ధం ప్రభావం.. భారత ఔషధ పరిశ్రమపై ప్రభావం

  • యుద్ధ పరిస్థితుల ప్రభావంపై డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ (ఇండియా) వెల్ఫేర్ అసోసియేషన్ ఆందోళన
  • ప్రపంచంలో అతిపెద్ద ఔషధ ఉత్పత్తి, ఎగుమతి దేశాలలో భారత్‌ ఒకటి
  • అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలతో ముడిపడి ఉంది.
  • గల్ఫ్ ప్రాంతంలో భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు నేథప్యంలో
  • ఔషధ తయారీదారులు, ఎగుమతిదారులు, దిగుమతిదారులు, దేశీయ వ్యాపారులపై ప్రత్యక్ష ప్రభావం
2026-03-26 11:06:14

కొనసాగుతున్న చర్చల యత్నాలు 

  • అమెరికా, ఇరాన్‌ నడుమ చర్చల దిశగా పలు దేశాలు ప్రయత్నాలు
  • ఇరుదేశాలు అంగీకరిస్తే వాటి నడుమ ద్వైపాక్షిక చర్చలకు వేదికగా నిలిచేందుకు..
  • పాకిస్తాన్‌ సిద్ధమని ఆ దేశ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ పునరుద్ఘాటించారు.
  • కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా తన 15 షరతులు
  • పాక్‌ ద్వారానే ఇరాన్‌కు అందజేసినట్టు పేర్కొన్న న్యూయార్క్‌ టైమ్స్‌ వార్తా సంస్థ
  • అయితే వాటిని పూర్తిగా తిరస్కరిస్తున్నట్టు ఇరాన్‌ ఉన్నతాధికారిని ఉటంకిస్తూ ఆ దేశ ప్రభుత్వ టీవీ చానల్‌ ప్రకటన
  • యుద్ధం ఎప్పుడు ముగియాలో నిర్ణయించాల్సింది ఇరానే తప్ప ట్రంప్‌ కాదు
  • అంతేగాక ఇరాన్‌ కూడా 8 షరతులతో కూడిన తమ ప్రతిపాదనలను పాక్‌ ద్వారానే అమెరికాకు పంపింది 
2026-03-26 09:59:47

విరమణకు షరతులు

  • ఇరాన్‌కు అమెరికా 15 ప్రతిపాదనలు
  • అంగీకరిస్తే నెల పాటు కాల్పుల విరమణ
  • తిరస్కరించిన ఇరాన్, అమెరికాకు 8 షరతులు
  • ఒప్పుకుంటేనే యుద్ధం ఆగుతుందని స్పష్టికరణ
  • కొనసాగిన ఇజ్రాయెల్, ఇరాన్‌ పరస్పర దాడులు
  • అబ్రహంలింకన్‌ యుద్ధ నౌకపై దాడి: ఇరాన్‌
  • మందెబ్‌ జలసంధినీ మూసేస్తానని హెచ్చరిక
  • కువైట్‌ విమానాశ్రయంలో భారీ మంటలు
     
2026-03-26 09:56:57
Advertisement
 
Advertisement
Advertisement