నెతన్యాహును వేటాడి హతమార్చుతాం: ఇరాన్‌ | Us Israel Iran War Live Updates March 15 | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

నెతన్యాహును వేటాడి హతమార్చుతాం: ఇరాన్‌

మహ్మద్ జిదాన్‌తో కలిసి ఇరాన్‌ కుట్ర: ఇజ్రాయెల్‌

  • మహ్మద్ జిదాన్ ప్రణాళికాబద్ధ దాడుల్లో భాగమై పనిచేశాడు 
  • మహ్మద్ జిదాన్ ఓ పాలస్తీనా ఉగ్రవాది 
  • ఇరాన్ ఇంటెలిజెన్స్ మార్గనిర్దేశంలో అతడు పనిచేశాడు
  • ఇజ్రాయెల్‌లో ఉగ్రదాడులను ప్రోత్సహించే ప్రయత్నం చేశాడు
  • వివరాలు ప్రకటించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) 
2026-03-15 20:35:05

ఇరాన్‌లోని అమెరికా కాన్సుల్ భవనం వద్ద కలకలం

  • ఇజ్రాయెల్‌పై కొనసాగుతున్న ఇరాన్‌ దాడులు
  • ఇజ్రాయెల్‌లో అమెరికా కాన్సుల్ నివాస భవనాన్ని తాకిన ఇరాన్ క్షిపణి శకలం 
2026-03-15 18:02:46

దర్యాప్తునకు సహకరిస్తాం: ఇరాన్

  • యుద్ధంలో ప్రజలు నివసించే ప్రాంతాలపై దాడులు?
  • ఆ ఆరోపణలపై దర్యాప్తునకు సహకరించేందుకు ఇరాన్ సిద్ధం
  • మా పొరుగు దేశాలతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేయండి 
  • యుద్ధం ముగించడానికి చేసే ప్రయత్నాలను స్వాగతిస్తాం
  • పశ్చిమాసియాలో నివాస ప్రాంతాలను మేము లక్ష్యంగా చేసుకోలేదు: ఇరాన్‌
2026-03-15 15:20:57

నెతన్యాహు బతికే ఉంటే చంపేస్తాం: ఇరాన్

  • నెతన్యాహు బ్రతికే  ఉంటే ఎట్టిపరిస్థితుల్లో చంపుతాం ఇరాన్ 
  • పిల్లలను చంపే నేరస్థుడు బ్రతికే ఉన్నా చంపడమే 
  • నెతన్యాహును వెతికి చంపుతామని ఇరాన్ ప్రకటన 
  • గత కొంతకాలంగా నెతన్యాహుకు ఏమైందంటూ ప్రచారం
  • ఆయన ప్రాణాలతో ఉన్నాడా లేదా అని అనుమానం 
  • ఈ నేపథ్యంలో ప్రకటన విడుదల చేసిన ఇరాన్
2026-03-15 12:19:03

ఇరాన్‌: రెజా పహ్లవీ సంచలన ప్రకటన

ఇరాన్‌లో ఇస్లామిక్ ప్రభుత్వం కూలితే కొత్త ప్రభుత్వం ఏర్పాటు 
కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అంతా సిద్ధంగా ఉందని ప్రకటన 
ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న రెజా పహ్లవీ

2026-03-15 10:56:47

గల్ఫ్ దేశాల్లో సీబీఎస్ఈ ప్లస్ టు పరీక్షలు పూర్తిగా రద్దు

మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇజ్రాయెల్‌తో యుద్ధం తీవ్రరూపం
ఇజ్రాయెల్‌పై విరుచుకుపడుతున్న ఇరాన్
సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్‌ దాడులు

2026-03-15 10:42:56

కువైట్‌ ఎయిర్‌పోర్టులో ఇరాన్‌ డ్రోన్ దాడులు

  • బాగ్ధాద్‌లోని అమెరికా ఎంబసీపైనా ఇరాన్  డ్రోన్‌ దాడి
  • మరోవైపు, ఇరాన్‌ మిలిటరీ, చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్‌ దాడి
  • ఇజ్రాయెల్‌​​- అమెరికా దాడుల్లో ఇద్దరు నిఘా కమాండర్లు మృతి
  • 24 గంటల్లో 200కుపైగా లక్ష్యాలు ధ్వంసం చేసినట్లు ప్రకటన
2026-03-15 09:02:33

ఖలీపా వదిలి వెళ్లిపోండి.. ఇరాన్

  • ఇజ్రాయెల్‌పై విరుచుకుపడుతున్న ఇరాన్ 
  • సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్‌ దాడులు
  • యుఏఈలోని ఓడరేవుల్లోంచి ప్రజలు వెళ్లిపోవాలని సూచన 
  • పోర్టులను టార్గెట్ చేసినట్లు వెల్లడించిన ఇరాన్ 
  • ఖర్గ్ ఐలాండ్‌పై దాడులకు ప్రతీకారంగా దాడులు 
  • దుబాయ్‌లోని జెబల్ అలీ నుంచి ప్రజలు వెళ్లిపోవాలని సూచన 
  • అబుదాబిలోని ఖలీపానుంచి వెళ్లిపోవాలని సూచన 
  • గల్ఫ్‌దేశాల్లో పౌర,వాణిజ్య ఆస్తులు టార్గెట్‌ చేసిన ఇరాన్
2026-03-15 08:23:25

ఇరాన్‌ మరో సంచలన హెచ్చరిక

  • ఓడరేవులకు దూరంగా ఉండాలంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రజలకు సూచన
  • అమెరికా ప్రయోజనాలు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండండి!
  • ఆ ప్రాంతాల్లోని ప్రజలు తక్షణమే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి
  • భారీ దాడులకు సిద్ధమవుతున్నామనే సంకేతాలు
2026-03-15 07:31:01

ఇస్ఫహాన్ నగరంలో ఫ్యాక్టరీపై ఇజ్రాయెల్ దాడి

  • రిఫ్రిజిరేటర్ల ఫ్యాక్టరీపై క్షిపణితో దాడి 
  • 15 మంది కార్మికులు మృతి
  • దాడులకు ఘాటుగా బదులిస్తామని ఇరాన్ హెచ్చరిక
2026-03-15 07:20:43

హార్మూజ్‌కు యుద్ధనౌకలు పంపండి: ట్రంప్‌

  • ప్రపంచ దేశాలకు ట్రంప్‌ విజ్ఞప్తి
  • హార్మూజ్‌ జలసంధిని తెరిపించేందుకు ప్రపంచ దేశాలు యుద్ధ నౌకలు పంపాలి
  • చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాలకు విజ్ఞప్తి
  • పలు దేశాలు ఇప్పటికే అమెరికాకు దన్నుగా తమ యుద్ధ నౌకలను పంపేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి.
  • హార్మూజ్‌ను త్వరలో తెరిపిస్తాం
  • అక్కడినుంచి అంతర్జాతీయ రవాణా యథావిధిగా సాగేలా చర్యలు తీసుకుంటాం 
2026-03-15 07:19:27

గల్ఫ్‌ దేశాలపై దాడులొద్దు

  • ఇరాన్‌కు హమాస్‌ పిలుపు 
  • గల్ఫ్‌ దేశాలపై దాడులకు ఇరాన్‌ స్వస్తి పలకాలి
  • పాలస్తీనా సాయుధ సంస్థ హమాస్‌ విజ్ఞప్తి
  • పొరుగు దేశాలపై దాడులు మానుకోవాలి
  • యుద్ధానికి తక్షణం తెర దించేలా దేశాలన్నీ కృషి చేయాలి
  • ఇరాన్‌కు హమాస్‌ అత్యంత సన్నిహితమన్నది తెలిసిందే.
  • దానికి ఇరాన్‌ పూర్తిస్థాయిలో సాయుధ, ఆర్థిక సాయం చేస్తుంటుంది
  • హమాస్‌ ప్రకటనపై ఇరాన్‌ ఇప్పటిదాకా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు.  
2026-03-15 07:17:23

నిమిషాల్లో 1,430 క్షిపణులు!

  • ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డ ఇరాన్‌ 
  • ఖర్గ్‌ దీవిపై అమెరికా దాడితో ఇరాన్‌ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది
  • ఇజ్రాయెల్‌పై శనివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది
  • నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 1,430 క్షిపణులు ప్రయోగించింది!
  • ఇజ్రాయెల్‌ వైద్య సేవా విభాగానికి చెందిన మాగెన్‌ డేవిడ్‌ ఆడొమ్‌ దీన్ని ధ్రువీకరించారు
  • ఈలట్‌ నగరంలో చాలా ప్రాంతాలపై దాడులు జరిగాయి
  • ఎంతోమంది గాయపడ్డారని, వారిలో పలువురి పరిస్థితి విషమం!
  • జెరూసలేం, టెల్‌ అవీవ్‌తో పాటు పలు ఇజ్రాయెలీ నగరాలు కూడా క్షిపణుల మోతతో దద్దరిల్లిపోయాయి.  
2026-03-15 07:15:32

త్వరలో ఇరాన్‌పై భూతల దాడుల దిశగా యోచన!

  • గల్ఫ్‌కు మరిన్ని యుద్ధ నౌకల తరలింపు 
  • హుటాహుటిన 2,500 మంది సైనికులు 
  • గల్ఫ్‌ చమురు వ్యవస్థలపై ఇరాన్‌ దాడులు
  • యూఏఈలోని చమురు క్షేత్రంలో మంటలు  
  • పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రం  
2026-03-15 07:12:22
Advertisement
 
Advertisement
Advertisement