బంకర్‌ బస్టర్లతో దాడి.. సంచలన వీడియో షేర్ చేసిన ట్రంప్ | Massive Blasts In Iran Isfahan: Trump Shares Video | Sakshi
Sakshi News home page

బంకర్‌ బస్టర్లతో దాడి.. సంచలన వీడియో షేర్ చేసిన ట్రంప్

Mar 31 2026 9:25 AM | Updated on Mar 31 2026 10:22 AM

Massive Blasts In Iran Isfahan: Trump Shares Video

ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దూకుడు కొనసాగుతోంది. తాజాగా.. ఇరాన్‌లో అణుకేంద్రాలు ఉన్న ఇస్ఫహాన్‌పై అమెరికా విరుచుకుపడింది. ఓ ప్రధాన ఆయుధ నిల్వల డిపోపై బంకర్‌ బస్టర్లతో దాడి చేసింది. భారీ పేలుళ్లకు సంబధించి ఓ వీడియోను ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌లో పోస్టు చేశారు. మీడియా నివేదికల ప్రకారం.. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున ఇస్ఫహాన్ నగరంలో చోటుచేసుకుంది.

ఈ వీడియోలో వరుస పేలుళ్లు సంభవించడం.. ఆ తర్వాత ఆకాశమంతా నారింజ రంగు మంటలతో నిండిపోవడం కనిపిస్తోంది. అయితే, ట్రంప్ ఈ వీడియోకు ఎటువంటి వివరణ ఇవ్వలేదు. అయితే, ఇస్ఫహాన్‌లోని ఆయుధ నిల్వలు  ఉన్న డిపోపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల దృశ్యాలేనని మీడియా నివేదికలు చెబుతున్నాయి. సుమారు 23 లక్షల జనాభా కలిగిన ఇస్ఫహాన్ నగరంలో 'బదర్' సైనిక విమానశ్రయం కూడా ఉంది.

మరోవైపు, ఇరాన్‌కు ట్రంప్‌ తీవ్రస్థాయి హెచ్చరికలతో అల్టిమేటం ఇచ్చిన సంగతి తెలిసిందే. అత్యంత శుద్ధ యురేనియం నిల్వలను అప్పగిస్తూ, యుద్ధం నుంచి తప్పుకుంటూ శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని లేదంటే ఇరాన్‌ను సర్వనాశనం చేస్తానని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’లో పలు పోస్ట్‌లు పెట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement