గల్ఫ్‌ జలాల్లో మళ్లీ మొదలైన డ్రోన్‌ దాడులు | Us Israel Iran War News March 31 Live Updates | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

గల్ఫ్‌ జలాల్లో మళ్లీ మొదలైన డ్రోన్‌ దాడులు

టెక్‌ కంపెనీలకు ఇరాన్‌ వార్నింగ్‌

  • గల్ఫ్‌ దేశాల్లోని  అమెరికా టెక్‌ కంపెనీలకు ఇరాన్‌ వార్నింగ్‌
  • రేపట్నుంచి ఆ టెక్‌ కంపెనీలపై దాడులు చేస్తాం
  • 10 టెక్‌ కంపెనీలు మా జాబితాలో ఉన్నాయి

     

2026-03-31 21:17:18

ఇరాన్‌పై యుద్ధం.. అమెరికాకు బిగ్‌ షాక్‌

ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న అమెరికా విమానాలపై ఆంక్షలు 
తమ దేశ గగన తలాన్ని మూసేస్తున్నట్లు ఇటలీ ప్రకటన 
అమెరికా విమానాలకు నిన్ననే గగనతలాన్ని మూసేసిన స్పెయిన్‌ 
తమ యుద్ధ విమానాలకు ఫ్రాన్స్ అనుమతి ఇవ్వడం లేదన్న ట్రంప్‌
ఫ్రాన్స్‌‌ చర్యలను గుర్తించుకుంటామన్న ట్రంప్‌

2026-03-31 17:28:53

ఇరాన్ భూగర్భ క్షిపణి స్థావరంపై అమెరికా దాడి

  • ఇరాన్ భూగర్భ క్షిపణి స్థావరంపై అమెరికా భీకర దాడులు
  • శక్తిమంతమైన బంకర్-బస్టర్ బాంబులతో  ఇరాన్ భూగర్భ క్షిపణి స్థావరంపై దాడి
  •  ఈ దాడితో ఇస్ఫహాన్‌లో భారీ పేలుళ్లు 
2026-03-31 15:59:16

నలుగురు ఇజ్రాయిల్‌ కమాండోల మృతి

  • హిజ్బుల్లా ఉగ్రవాదులతో జరిగిన దాడిలో నలుగురు ఐడిఎఫ్ కమాండోలు మృతి 
  • నహల్ రికనైసెన్స్ యూనిట్‌కు చెందిన సైనికులుగా ధృవీకరణ
  • స్డెరోట్‌కు చెందిన టీమ్ కమాండర్ కెప్టెన్ నోమ్ మద్మోని (22)
  • లెహావిమ్‌కు చెందిన స్టాఫ్ సార్జెంట్ బెన్ కోహెన్ (21)
  • బాట్ యామ్‌కు చెందిన స్టాఫ్ సార్జెంట్ మాక్సిమ్ ఎంటిస్ (21)
  • మోడిన్-మక్కాబిమ్-రెయుట్‌కు చెందిన స్టాఫ్ సార్జెంట్ గిలాడ్ హారెల్ (21)లుగా గుర్తింపు
2026-03-31 15:18:57

స్పై ఆరోపణలపై ఇద్దరిని అరెస్ట్‌ చేసిన ఇరాన్‌

  • అమెరికా, ఇజ్రాయెల్‌కు సమాచారం పంపిన ఇద్దరు వ్యక్తులు?
  • స్పై ఆరోపణలపై ఇద్దరిని అరెస్ట్‌ చేసిన ఇరాన్‌
  • ఇరాన్ వాయువ్య ప్రాంతంలో భద్రతా దళాలు, సున్నిత ప్రాంతాలపై సమాచారం పంపిన ఆ ఇద్దరు?
  • అమెరికా-ఇజ్రాయెల్ స‍్పై సర్వీసెస్‌కు సమాచారం పంపినట్లు ఆరోపణలు 
  • అమెరికా-ఇజ్రాయెల్‌కు ఇరాన్‌లోని సురక్షిత ప్రాంతాల వివరాలు ఇచ్చిన ఆ ఇద్దరు
  • ప్రతిఫలంగా ఆ ఇద్దరూ క్రిప్టోకరెన్సీ పొందినట్లు పేర్కొన్న తస్నీమ్ మీడియా 
  • ఈస్ట్ అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లోని ఓస్కూ ప్రాంతంలో అరెస్ట్‌ 
2026-03-31 13:05:11

మరోసారి ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులు

  • జెరూసలేంపై క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్‌
  • జెరూసలేంలోని 10 చోట్ల పేలుళ్లు
  • పేలుళ్లను ధ్రువీకరించిన ఇజ్రాయెల్‌
2026-03-31 10:24:52

బంకర్‌ బస్టర్లతో ఇస్ఫహాన్‌పై దాడి.. వీడియోను షేర్ చేసిన ట్రంప్

  • ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌లో భారీ పేలుళ్లు.. వీడియోను షేర్ చేసిన ట్రంప్
  • అణుకేంద్రాలు ఉన్న ఇస్ఫహాన్‌పై విరుచుకుపడిన అమెరికా
  • మంగళవారం తెల్లవారుజామున బంకర్‌ బస్టర్లతో దాడి
  • పేలుళ్ల అనంతరం ఆకాశమంతా నారింజ రంగు మంటలతో నిండిపోవడం ఈ వీడియోలో కనిపిస్తోంది.
  • ట్రంప్ ఈ వీడియోకు ఎటువంటి వివరణ ఇవ్వలేదు
  • అయితే, ఇస్ఫహాన్‌లోని ఒక ప్రధాన  ఆయుధ నిల్వలు  డిపోపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల దృశ్యాలేనని పేర్కొంటున్న మీడియా నివేదికలు
  • ఇస్ఫహాన్ సుమారు 23 లక్షల జనాభా కలిగిన నగరం
  • ఇక్కడ 'బదర్' సైనిక విమానశ్రయం కూడా ఉంది

2026-03-31 09:07:33

హర్మూజ్‌ దగ్గర చిక్కుకున్న 19 భారత ఇంధన నౌకలు

  • హర్మూజ్‌ దగ్గర చిక్కుకున్న 19 భారత ఇంధన నౌకలు
  • ఇప్పటివరకు 8 నౌకలు వచ్చినట్లు కేంద్రం ప్రకటన
  • నేడు ముంబై చేరుకోనున్న ఎల్‌పీజీ నౌక
  • రేపు న్యూమంగళూరు చేరుకోనున్న మరో నౌక
2026-03-31 08:37:56

గల్ఫ్‌ జలాల్లో మళ్లీ మొదలైన డ్రోన్‌ దాడులు

గల్ఫ్‌ జలాల్లో మళ్లీ మొదలైన డ్రోన్‌ దాడులు
ఆందోళనలో అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు
హర్ముజ్‌ సమీపంలో దాడులతో గ్లోబల్‌ మార్కెట్‌పై ప్రభావం
హర్ముజ్‌ జలసంధిని వెంటనే తెరవాలని ట్రంప్‌ హచ్చరిక
లేదంటే ఇరాన్‌ విద్యుత్‌కేంద్రాలపై దాడులు తప్పవన్న ట్రంప్‌
 

2026-03-31 08:19:14

దుబాయ్‌ తీరంలో కువైట్‌ చమురు ట్యాంకర్‌పై డ్రోన్‌ దాడి

  • దుబాయ్‌ తీరంలో కువైట్‌ చమురు ట్యాంకర్‌పై డ్రోన్‌ దాడి
  • యాంకర్‌ పాయింట్‌ వద్ద  నిలిపిన నౌకపై డ్రోన్‌ దాడి
  • డ్రోన్‌ దాడితో చమురు ట్యాంకర్‌లో చెలరేగిన మంటలు
  • నౌకలోని 24 మంది సిబ్బంది సురక్షితం
     
2026-03-31 08:11:15

లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ భీకర దాడులు

  • బీరుట్‌లో హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు
  • 100కు పైగా బహుళ అంతస్తుల భవనాలను ఇజ్రాయెల్‌
  • లెబనాన్‌లో పేలుడు, ఇద్దరు ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు మృతి
2026-03-31 08:04:52

కువైట్‌లోని జల, విద్యుత్‌ కేంద్రంపై బాంబుల వర్షం

  • అమెరికా మిత్రదేశాలపై ఇరాన్ దాడులు కొనసాగింపు
  • కువైట్‌లోని జల, విద్యుత్‌ కేంద్రంపై బాంబుల వర్షం
  • ఉత్తర ఇజ్రాయెల్‌లోని హైఫా సిటీలోని భారీ చమురు రిఫైనరీపై బాంబులేసిన ఇరాన్‌
  • మంటలు వ్యాపించి దట్టమైన పొగలు వెలువడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌
  • సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్‌పై క్షిపణులను ప్రయోగించగా..
  • ఐదింటిని గగనతల రక్షణవ్యవస్థలు కూల్చేశాయి
  • దుబాయ్‌లోనూ ఒక క్షిపణిని అడ్డుకున్నారు
  • ఇజ్రాయెల్‌ ప్రధాన అణు పరిశోధనా కేంద్రం మీదా ఇరాన్‌ దాడులుచేసింది.
2026-03-31 07:18:22

ఇరాన్‌కు తీవ్రస్థాయి హెచ్చరికలతో ట్రంప్‌ అల్టిమేటం

తేల్చకుంటే సర్వనాశనమే
ఇరాన్‌ త్వరగా ఒప్పందం కుదుర్చుకోవాలి
లేదంటే చమురుక్షేత్రాలు మొదలు విద్యుత్‌ వ్యవస్థలదాకా అన్నింటినీ పేల్చేస్తాం
ఖర్గ్‌ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటాం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అల్టిమేటం
ప్రతిదాడులను ఆపని ఇరాన్‌
కువైట్‌లోని విద్యుత్‌ ప్లాంట్‌పై దాడి
ఇజ్రాయెల్‌ ఆయిల్‌ రిఫైనరీపైనా క్షిపణి దాడి
అమెరికా బలగాలు కాలుమోపితే పర్షియన్‌ గల్ఫ్‌ను సముద్రమైన్లతో నింపేస్తాం
ఇరాన్‌ హెచ్చరిక

2026-03-31 07:15:29
Advertisement
 
Advertisement
Advertisement