అందుకేనా.. బంగారం ఇంతలా పెరిగింది! | Gold Climbs Over 3 Percent As Middle East Peace Hopes Drag Down Dollar and Oil | Sakshi
Sakshi News home page

అందుకేనా.. బంగారం ఇంతలా పెరిగింది!

May 6 2026 7:17 PM | Updated on May 6 2026 8:26 PM

Gold Climbs Over 3 Percent As Middle East Peace Hopes Drag Down Dollar and Oil

బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ఊహకందని మార్పులు జరుగుతూనే ఉన్నాయి. అమెరికా - ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం సాధ్యమవుతుందనే ఆశలు పెరగడంతో, డాలర్ విలువ, చమురు ధరలు తగ్గాయి. దీంతో ద్రవ్యోల్బణ భయం తగ్గింది. గోల్డ్ రేటు ఊపందుకుంది.

స్పాట్ గోల్డ్ ధర 3.4 శాతం పెరిగి ఔన్సుకు సుమారు 4,708 డాలర్ల స్థాయికి చేరుకుంది. ఇది గడిచిన వారం రోజుల్లో అత్యధికం అనే చెప్పాలి. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ కూడా గణనీయంగా పెరిగాయి. సాధారణంగా బంగారం ధరలు పెరగడానికి ప్రపంచ అనిశ్చితి, డాలర్ బలహీనత, వడ్డీ రేట్ల అంచనాలు ప్రధాన కారణాలు.

చమురు ధరలు తగ్గితే ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గుతుంది. దీని ఫలితంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంటుంది. తక్కువ వడ్డీ రేట్లు ఉన్నప్పుడు బంగారం వంటి వాటిపై పెట్టుబడులు పెరుగుతాయి. అందుకే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇదే సమయంలో గ్లోబల్ స్టాక్ మార్కెట్లు కూడా చమురు ధరలు తగ్గడంతో పెరుగుదల చూపాయి. ఇది పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని పెంచింది. మరోవైపు డాలర్ విలువ తగ్గడం వల్ల బంగారం ఇతర కరెన్సీలు కలిగిన వారికి మరింత చౌకగా మారింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. వెండి, ప్లాటినం, పల్లాడియం వంటి విలువైన లోహాల ధరలు కూడా పెరగడం గ్లోబల్ మార్కెట్‌లో బలమైన డిమాండ్‌ను సూచిస్తోంది.

ఇదీ చదవండి: అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement