అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకి | Baby Boomer Retirement Crisis Ahead Robert Kiyosaki Issues Stark Warning | Sakshi
Sakshi News home page

అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకి

May 6 2026 3:03 PM | Updated on May 6 2026 4:00 PM

Baby Boomer Retirement Crisis Ahead Robert Kiyosaki Issues Stark Warning

ఆర్ధిక విషయాలకు సంబంధించిన విషయాలను, పెట్టుబడులకు సంబంధించిన సమాచారం గురించి చెప్పే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki), తాజాగా బేబీ బూమర్స్ గురించి చెప్పారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

''1974లోనే నేను బేబీ బూమర్ల (1946 నుంచి 1964 మధ్య పుట్టిన వారిని బేబీ బూమర్స్ అంటారు) పదవీ విరమణ విపత్తు రాబోతోందని ఊహించాను. 2026 చివరి నాటికి లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి, ఆర్థికంగా ఇబ్బందుల్లో పడతారు. చాలామంది నిరాశ్రయులవుతారు'' అని కియోసాకి హెచ్చరించారు.

ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కాస్త కఠినంగా మారుతున్నాయి. చాలా మంది వృద్ధులు ఉద్యోగాలు కోల్పోయి, సరిపడా పొదుపులు లేక ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు, ఇది సమాజానికి పెద్ద సవాలు. అందుకే ముందుగానే ఆర్థిక ప్రణాళిక చాలా ముఖ్యమని కియోసాకి చెబుతున్నారు.

మన మెదడు మనకు ఉన్న గొప్ప ఆస్తి. సరైన జ్ఞానం, సరైన నిర్ణయాలు తీసుకుంటే ఎప్పుడైనా మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. సంపదను సృష్టించడం అంత కష్టం కాదు, సరైన మార్గం తెలుసుకుంటే సరిపోతుంది.

ఇదీ చదవండి: ఇప్పటి ప్రపంచానికి అవి సరిపోవు: కియోసాకి హెచ్చరిక

కొంతమంది నిపుణులు.. భవిష్యత్తు కోసం బంగారం, వెండి వంటి విలువైన లోహాలు, అలాగే డిజిటల్ ఆస్తులు అయిన బిట్‌కాయిన్, ఎథీరియం లాంటి వాటిలో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా, అవగాహనతో ముందుకు వెళ్లడం అవసరం అని రాబర్ట్ కియోసాకి వెల్లడించారు. మొత్తం మీద.. రిటైర్మెంట్ తర్వాత సుఖంగా జీవించాలంటే ముందుగానే ప్రణాళిక అవసరం అని ఆయన పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement