రానున్న రోజుల్లో.. చమురు ధరలు ఇలా! | Crude Oil Prices are Set to Remain High Due to Middle East Crisis | Sakshi
Sakshi News home page

రానున్న రోజుల్లో.. చమురు ధరలు ఇలా!

May 12 2026 5:45 PM | Updated on May 12 2026 5:52 PM

Crude Oil Prices are Set to Remain High Due to Middle East Crisis

అంచనాలను మించి దీర్ఘకాలం కొనసాగుతున్న పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల కారణంగా ముడిచమురు ధరలు గరిష్ట స్థాయిలలోనే కొనసాగే వీలున్నట్లు ఆసియా అభివృద్ధి బ్యాంక్‌(ఏడీబీ) చీఫ్‌ ఎకనమిస్ట్‌ అల్బెర్ట్‌ పార్క్‌ పేర్కొన్నారు.

వెరసి తాజా అంచనాల ప్రకారం.. 2026లో బ్యారల్‌ ముడిచమురు 96 డాలర్ల స్థాయిలో కొనసాగవచ్చు. 2027లో బ్యారల్‌ చమురు 80 డాలర్ల స్థాయిలో కదిలే వీలుంది. వెరసి ముడిచమురు ధరలు అధికస్థాయిలలో కొనసాగనున్నట్లు భావిస్తున్నామని వివరించారు.

ఈ నేపథ్యంలో స్పాట్‌ ధరలతో పోలిస్తే ఫ్యూచర్స్‌ మార్కెట్లో అధిక(ప్రీమియం) ధరలు పలుకుతున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం చమురు సరఫరాల కొరత ప్రభావం చూపుతున్నట్లు పేర్కొన్నారు. చమురు ధరల ఫలితంగా దేశ జీడీపీ వృద్ధిలో 0.6 శాతం కోత పడవచ్చని వెరసి 6.3 శాతానికి ఆర్థిక పురోగతి పరిమితంకావచ్చని అంచనా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement