పెట్రోకెమికల్‌ ఉత్పత్తులపై సుంకం మినహాయింపు | Indian government has waived customs duties on petrochemical products | Sakshi
Sakshi News home page

పెట్రోకెమికల్‌ ఉత్పత్తులపై సుంకం మినహాయింపు

Apr 3 2026 4:38 AM | Updated on Apr 3 2026 4:38 AM

Indian government has waived customs duties on petrochemical products

ప్రభుత్వ ఖజానాపై రూ.1,800 కోట్ల భారం 

ఫార్మా, టెక్స్‌టైల్స్, కెమికల్స్‌ రంగాలకు సానుకూలం

న్యూఢిల్లీ: కీలకమైన పెట్రోకెమికల్‌ ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను తాత్కాలికంగా (జూన్‌ 30 వరకు) మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది. మెథనాల్, అనిహిడ్రస్‌ అమ్మోనియా, టోల్యూన్, స్టైరిన్, డైక్లోరో మెథేన్‌ (మెథిలిన్‌ క్లోరైడ్‌), వినిల్‌ క్లోరైడ్‌ మోనోమర్, పాలీ బూటాడీన్, స్టైరిన్‌ బూటాడీన్, అన్‌శాచురేటెడ్‌ పాలిస్టర్‌ రెజిన్లను సుంకాల్లేకుండా దిగుమతి చేసు కోవచ్చు. ఈ నిర్ణయం ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్, టెక్స్‌టైల్స్‌తోపాటు ప్లాస్టిక్స్, ప్యాకేజింగ్, ఆటో విడిభాగాల తయారీ సంస్థలకు ఉపశమనం కల్పించనుంది.

 పశ్చిమాసియా సంక్షోభంతో కీలకమైన పెట్రోకెమికల్‌ ఉత్పత్తుల సరఫరా స్థిరంగా ఉండేందుకు ప్రభుత్వ నిర్ణయం సాయం చేయనుంది. ఈ చర్యతో ప్రభుత్వ ఖజానాపై రూ.1,800 కోట్ల భారం పడినప్పటికీ.. ధరలస్థిరత్వానికి, ఉత్పత్తి, సరఫరా కొనసాగేందుకు సాయపడుతుందని పరోక్ష పన్నుల కేంద్ర మండలి సభ్యుడు సంజయ్‌ మంగల్‌ తెలిపారు. అంతర్జాతీయంగా ముడి చమురు, గ్యాస్‌ ధరలు గణనీయంగా పెరిగిపోయిన నేపథ్యంలో వినియోగదారులపై ఈ భారం పడకుండా.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని కేంద్రం తాజాగా తగించడం తెలిసిందే.    

Advertisement
 
Advertisement
Advertisement