విండీస్‌ రూపంలో సవాల్‌! | ICC Womens World Cup, India vs West Indies | Sakshi
Sakshi News home page

విండీస్‌ రూపంలో సవాల్‌!

Mar 12 2022 4:25 AM | Updated on Mar 12 2022 4:25 AM

ICC Womens World Cup, India vs West Indies - Sakshi

హామిల్టన్‌: మహిళల వన్డే ప్రపంచకప్‌లో మరో కీలక పోరుకు భారత జట్టు సన్నద్ధమైంది. నేడు జరిగే పోరులో వెస్టిండీస్‌తో మిథాలీ బృందం తలపడుతుంది. తొలి మ్యాచ్‌లో పాక్‌పై ఘన విజయం సాధించినా... గత మ్యాచ్‌లో కివీస్‌ చేతిలో భారీ పరాజయం బ్యాటింగ్‌లో మన పరిమితులు చూపించింది. ముఖ్యంగా హర్మన్‌ మినహా ఇతర బ్యాటర్లంతా విఫలం కావడం ఆందోళన కలిగించేదే. బౌలర్లు రెండు మ్యాచ్‌లలోనూ చక్కటి ప్రదర్శన కనబర్చగా, బ్యాటింగ్‌ వైఫల్యమే జట్టును దెబ్బ తీసింది. ఓపెనర్లు స్మృతి మంధాన, యస్తిక శుభారంభం అందిస్తేనే తర్వాతి బ్యాటర్లు దానిని కొనసాగించగలరు.

పేలవ స్ట్రయిక్‌రేట్‌తో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ ఈ మ్యాచ్‌లోనైనా ధాటిగా ఆడి రాణిస్తే జట్టుకు ప్రయోజనం చేకూరుతుంది. హర్మన్‌ ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం కాగా... రిచా ఘోష్‌ కూడా చివర్లో దూకుడుగా ఆడాల్సి ఉంది. జులన్, మేఘన, రాజేశ్వరి, పూజ, దీప్తిలతో బౌలింగ్‌ పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు విండీస్‌ జోరు మీదుంది. ఆతిథ్య న్యూజిలాండ్, డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌లపై సంచలన విజయాలు సాధించిన విండీస్‌ భారత్‌నూ ఓడించాలని పట్టుదలగా ఉంది. జట్టులో క్యాంప్‌బెల్, డాటిన్, హేలీ మాథ్యూస్, స్టెఫానీ, అనీసా కీలక ప్లేయర్లుగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement