నేడు హర్మన్ సేన చివరి లీగ్ మ్యాచ్
మ.3.00 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
ముంబై: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్‌కు అర్హత సాధించే వరకు భారత జట్టు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. గత మ్యాచ్‌లో సెమీస్ స్థానం ఖాయమైన తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా తమ చివరి లీగ్ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆదివారం జరిగే ఈ పోరులో తమకంటే బలహీనమైన బంగ్లాదేశ్‌తో హర్మన్ సేన తలపడుతుంది. ఈ మ్యాచ్ ఫలితం లీగ్ దశలో భారత్ స్థానంపై ప్రభావం చూపే అవకాశం లేదు. గెలిచినా 8 పాయింట్లతో నాలుగో స్థానంతోనే ముగుస్తుంది. అయితే ఓడితే మాత్రం సెమీస్‌కు ముందు టీమ్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసే ప్రమాదం ఉంది.
ఈ నేపథ్యంలో ఆసీస్‌తో అసలు పోరుకు ముందు తమ జట్టులోని లోపాలు సవరించుకొని అన్ని విధాలా సిద్ధమయ్యేందుకు భారత్‌కు ఈ మ్యాచ్ అవకాశం కల్పిస్తోంది. మరో వైపు బంగ్లాదేశ్ సంచలనాన్ని ఆశిస్తోంది. టోరీ్నలో ఒకే ఒక విజయం (పాక్‌పై) సాధించిన బంగ్లా ఇతర మ్యాచ్‌లలో ప్రత్యర్థులకు గట్టి పోటీనిచి్చంది. ప్రధానంగా తమ బలమైన స్పిన్‌పైనే ఆ జట్టు ఆధారపడుతోంది.


