
రేపటి నుంచి (సెప్టెంబర్ 30) మహిళల క్రికెట్ మహా సంగ్రామం (ICC Women's World Cup-2025) ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి భారత్ (India), శ్రీలంక (Sri Lanka) సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.
నవంబర్ 2 వరకు జరిగే ఈ క్రికెట్ పండుగలో మొత్తం 8 జట్లు (భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక) పాల్గొంటున్నాయి. 5 వేదికలపై 34 రోజుల పాటు 31 మ్యాచ్‌లు జరుగనున్నాయి. మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో ఇది 13వ ఎడిషన్.
మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయి..?
భారత్‌లో: గౌహతి, ఇండోర్, విశాఖపట్నం, నవి ముంబై
శ్రీలంకలో: కొలంబో
కొలంబోలో మొత్తం 10 మ్యాచ్‌లు జరుగుతాయి. పాకిస్తాన్ జట్టు ఆడే అన్ని మ్యాచ్‌లు ఇక్కడే షెడ్యూల్ అయ్యాయి.
మ్యాచ్ టైమింగ్స్..
ఒక్క మ్యాచ్ మినహా అన్ని మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 26న న్యూజిలాండ్ vs ఇంగ్లండ్ మ్యాచ్ మాత్రం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.
జట్ల కెప్టెన్లు..
భారత్- హర్మన్‌ప్రీత్ కౌర్
ఆస్ట్రేలియా- అలిస్సా హీలీ
ఇంగ్లాండ్- నాట్ స్కివర్-బ్రంట్
న్యూజిలాండ్- సోఫీ డివైన్
పాకిస్తాన్- ఫాతిమా సనా
దక్షిణాఫ్రికా- లారా వోల్వార్డ్ట్
బంగ్లాదేశ్- నిగార్ సుల్తానా జోటి
శ్రీలంక- చమారి అటపత్తు
భారత మ్యాచ్‌లు..
సెప్టెంబర్ 30: భారత్ vs శ్రీలంక – గౌహతి
అక్టోబర్ 5: భారత్ vs పాకిస్తాన్ – కొలంబో
అక్టోబర్ 12: భారత్ vs ఆస్ట్రేలియా – విశాఖపట్నం
అక్టోబర్ 19: భారత్ vs ఇంగ్లాండ్ – ఇండోర్
అక్టోబర్ 23: భారత్ vs న్యూజిలాండ్ – నవి ముంబై
అక్టోబర్ 26: భారత్ vs బంగ్లాదేశ్ – నవి ముంబై
అక్టోబర్ 29, 30: సెమీఫైనల్స్
నవంబర్ 2: ఫైనల్
భారత జట్టు..
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధన (వైస్ కెప్టెన్), జెమిమా, రిచా ఘోష్, దీప్తి శర్మ, రేణుకా సింగ్, స్నేహ్ రాణా, హర్లీన్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, ఉమా చేత్రి, అమన్‌జోత్, కాంతి గౌడ్, శ్రీ చరణి, ప్రతికా రావల్
రిజర్వ్స్: తేజల్ హసాబ్నిస్, ప్రీమా రావత్, ప్రియా మిశ్రా, మిన్ను మణి, సయాలి సత్ఘారే
ప్రసార వివరాలు..
మహిళల వన్డే వరల్డ్‌కప్ 2025ను భారత్‌లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. JioHotstar యాప్ మరియు వెబ్‌సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉంటుంది.
చదవండి: టీమిండియాకు కొత్త టాస్క్.. మరో మూడు రోజుల్లో ప్రారంభం