తొలి బెర్త్‌ ఎవరిదో! | England and SA clash in Women's World Cup semi | Sakshi
Sakshi News home page

తొలి బెర్త్‌ ఎవరిదో!

Jul 18 2017 12:04 AM | Updated on Sep 5 2017 4:15 PM

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరడమే లక్ష్యంగా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు సిద్ధమయ్యాయి.

బ్రిస్టల్‌: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరడమే లక్ష్యంగా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు సిద్ధమయ్యాయి. ఇరు జట్ల మధ్య నేడు తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. భారత్‌తో ఒక్క ఆరంభ మ్యాచ్‌లోనే ఇంగ్లండ్‌ ఓడింది. ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. పైగా లీగ్‌ దశలో దక్షిణాఫ్రికాను ఓడించిన ఆత్మవిశ్వాసం కూడా జట్టులో ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా పడుతూ లేస్తూ సెమీస్‌ చేరింది. ఆతిథ్య జట్టుతో పాటు పటిష్టమైన ఆసీస్‌ చేతిలో ఓడింది. అయితే విండీస్, భారత్‌లపై భారీ విజయాలతో సత్తా చాటుకుంది. 17 ఏళ్ల తర్వాత (2000) సెమీస్‌ చేరిన సఫారీ జట్టు టైటిల్‌తో మెగా టోర్నీని ముగించాలనే పట్టుదలతో ఉంది.

నేటి మధ్యాహ్నం గం. 2.30 నుంచి
స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement