
మహిళల క్రికెట్ అభివృద్ధి దిశగా ఐసీసీ మరో కీలక అడుగు వేసింది. 13వ మహిళల వన్డే వరల్డ్ కప్ (2025) కోసం 14 మంది మహిళా అంపైర్లు, నలుగురు మహిళా మ్యాచ్ రిఫరీలను ఎంపిక చేసింది. మహిళల వన్డే వరల్డ్ కప్ చరిత్రలో పూర్తిగా మహిళా అధికారులనే నియమించడం ఇదే మొదటిసారి.
ఈ చారిత్రక నిర్ణయం తీసుకోవడంలో ఐసీసీ అధ్యక్షుడు, బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా కీలకపాత్ర పోషించారు. ఇది మహిళల క్రికెట్ ప్రయాణంలో కీలక ఘట్టమని ఆయన అన్నారు.
ఓవరాల్‌గా చూస్తే అందరూ మహిళా అధికారులే ఉన్న నాలుగో గ్లోబల్ టోర్నమెంట్ ఇది. 2022 కామన్‌వెల్త్ క్రీడలు, తాజాగా జరిగిన రెండు టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో మ్యాచ్ అధికారులంతా మహిళలే.
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 కోసం ఎంపిక చేసిన మ్యాచ్ రిఫరీలు
- ట్రూడీ ఆండర్సన్,
- షాండ్రే ఫ్రిట్జ్
- జి.ఎస్. లక్ష్మి
- మిచెల్ పెరెరా
అంపైర్లు
- లారెన్ ఏజెన్‌బ్యాగ్
- కాండేస్ లా బోర్డే
- కిమ్ కాటన్
- సారా డాంబనేవనా
- షతిరా జకీర్ జెసీ
- కెరిన్ క్లాస్టే
- జనని ఎన్
- నిమాలి పెరెరా
- క్లేర్ పోలోసాక్
- వృందా రాథీ
- సూ రెడ్‌ఫెర్న్
- ఎలోయిస్ షెరిడన్
- గాయత్రి వేణుగోపాలన్
- జాక్వెలిన్ విలియమ్స్
కాగా, మహిళల వన్డే ప్రపంచకప్ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్‌లో ఆతిథ్య దేశాలే తలపడనున్నాయి. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ ఆడబోయే మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరుగుతాయి.