భారత జట్టు ఓపెనర్ ప్రతీక రావల్ లీగ్ దశలో 7 మ్యాచ్‌లూ ఆడి 51.33 సగటుతో 308 పరుగులు చేసి జట్టు విజయాల్లో తానూ కీలకపాత్ర పోషించింది. ఇందులో 1 సెంచరీ, 1 అర్ధ సెంచరీ ఉన్నాయి. అయితే గాయంతో తప్పుకున్న ఆమె సెమీస్, ఫైనల్ ఆడలేకపోయింది. ప్రతీక స్థానంలో షఫాలీ వర్మకు చోటు లభించింది. కప్ గెలిచిన అనంతరం జట్టు సభ్యులంతా వీల్‌చైర్‌లో ఉన్న ప్రతీకను వేదిక మీదకు తీసుకొచ్చి జట్టు సంబరాల్లో భాగం చేశారు.
అయితే దురదృష్టవశాత్తూ ఆమెకు ఈ టోర్నీని చిరస్మరణీయంగా మార్చే ‘విన్నర్ మెడల్’ లభించలేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం 15 మందికే ఈ పతకాన్ని ఇస్తారు. ప్రతీకను పూర్తిగా జట్టు నుంచి తప్పించిన తర్వాతే అధికారికంగా షఫాలీని టీమ్‌లో చేర్చారు కాబట్టి ప్రతీకను పరిగణనలోకి తీసుకోలేదు.


