breaking news
Diamond league finals
-
పతిరగేతో మరోసారి తలపడనున్న నీరజ్ చోప్రా?
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా బ్రసెల్స్ వేదికగా జరుగుతున్న డైమండ్ లీగ్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. భారత కాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున జరిగిన డైమండ్ లీగ్ క్వాలిఫికేషన్ రౌండ్లో నీరజ్ 12 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. సెప్టెంబర్ 4-5 తేదీల్లో బ్రసెల్స్ డైమండ్ లీగ్ ఫైనల్ ఈవెంట్ జరగనుంది. ఇక ఆగస్టు 21న జరిగిన లుసానే డైమండ్ లీగ్‌లో ఈటెను 88.05 మీటర్ల దూరం విసిరిన నీరజ్ రెండో స్థానంలో నిలిచాడు. ఇది అతడికి ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన. అంతకముందు దోహా డైమండ్ లీగ్‌లో 85.69 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శనతో నాల్గో స్థానంతో తన సీజన్‌ను ప్రారంభించాడు. జూలైలో కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం గెలుచుకున్న ఈ భారత జావెలిన్ త్రోయర్, మొత్తం 12 పాయింట్లతో ఆరవ స్థానంలో నిలిచి బ్రసెల్స్ డైమండ్ లీగ్ ఫైనల్‌కు చేరుకున్నాడు.డైమండ్ లీగ్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన అథ్లెట్లు1. రుమేష్ తరంగ పతిరాగే (శ్రీలంక) - 39 పాయింట్లు2. అండర్సన్ పీటర్స్ (గ్రెనడా) - 35 పాయింట్లు3. కేశోర్న్ వాల్కాట్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో) - 23 పాయింట్లు4. కర్టిస్ థాంప్సన్ (అమెరికా) - 20 పాయింట్లు5. జూలియస్ యెగో (కెన్యా) - 13 పాయింట్లు6. నీరజ్ చోప్రా (భారతదేశం) - 12 పాయింట్లురుమేష్ పతిరాగే క్వాలిఫికేషన్ స్టాండింగ్స్‌లో అగ్రస్థానంలో ఉండగా, పీటర్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ కెషోర్న్ వాల్కాట్, యూఎస్ఏకు చెందిన కర్టిస్ థాంప్సన్, యెగో సహా నీరజ్ చోప్రాలు విజయవంతంగా ఫైనల్‌కు చేరుకున్నారు.పాయింట్లు ఎలా ఇస్తారంటే?ప్రతి డైమండ్ లీగ్ మీటింగ్‌లో, పురుషుల జావెలిన్ త్రోలో మొదటి ఎనిమిది స్థానాల్లో నిలిచిన వారికి పాయింట్లు కేటాయిస్తారు. మొదటి స్థానంలో ఉన్న అథ్లెట్‌కు 8 పాయింట్లు మొదలుపెట్టి.. 8వ స్థానం వరకు ఒక్కో పాయింట్ తగ్గించుకుంటూ పోతారు. అయితే క్వాలిఫయింగ్ సిరీస్ ముగింపులో అత్యధిక పాయింట్లు సాధించిన మొదటి ఆరుగురు అథ్లెట్లు మాత్రమే సీజన్ చివర్లో జరిగే డైమండ్ లీగ్ ఫైనల్లో స్థానం సంపాదిస్తారు. స్థానాలు టై అయితే సదరు అథ్లెట్ సీజన్లో అత్యుత్తమ చట్టబద్ధమైన ప్రదర్శన ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు.ఇక కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైన కెన్యాకు చెందిన జూలియస్ యెగో, జూరిచ్‌లో 81.66 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శనతో ఐదవ స్థానంలో నిలిచి, ఆరుగురు సభ్యుల డైమండ్ లీగ్ ఫైనల్లో మాత్రం చోటు దక్కించుకున్నాడు. బ్రసెల్స్ క్వాలిఫయింగ్ రౌండ్లోనూ తొలి స్థానంలో నిలిచిన రుమేశ్ తరంగ పతిరగే 2026 సీజన్లో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. రెండుసార్లు 90 మీటర్లకు పైగా త్రోలు విసిరిన పతిరగే, ఏడుసార్లు 88 మీటర్లకు మించి త్రోలు విపిరాడు. వాటిలో ఐదు 89 మీటర్లు ఉండడం విశేషం. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో స్వర్ణం కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న 23 ఏళ్ల పతిరగే వచ్చే వారం బ్రసెల్స్ డైమండ్ లీగ్ ఫైనల్లో మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు.🚨 NEERAJ CHOPRA QUALIFIES FOR THE DIAMOND LEAGUE FINAL! After the Zurich Diamond League results, India’s golden boy Neeraj Chopra has secured his place in the Diamond League Final in Brussels, the final leg of the 2026 Diamond League season.He has qualified alongside 5 other… pic.twitter.com/9Dao3Por7k— nnis Sports (@nnis_sports) August 28, 2026Read: జడేజా ఖాతాలో ఊహకు కూడా అందని చెత్త రికార్డు! -
Diamond League Final: ‘కోహినూర్’ నీరజ్
జ్యూరిచ్: అంతర్జాతీయ వేదికలపై భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా విజయ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. ఒలింపిక్స్ స్వర్ణంతోనే తాను ఆగిపోనని చాటుతూ ఆపై ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ పతకం అందుకున్న అతను... ఇప్పుడు మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అథ్లెటిక్స్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా విజేతగా నిలిచాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. గురువారం రాత్రి జరిగిన ఈ పోటీల్లో సత్తా చాటిన అతను 88.44 మీటర్ల దూరం జావెలిన్ విసిరి అగ్రస్థానం అందుకున్నాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన జాకబ్ వాలెచ్ (86.94 మీటర్లు) రెండో స్థానంలో నిలవగా, జూలియన్ వెబర్ (ఇంగ్లండ్)కు మూడో స్థానం దక్కింది. విజేతగా నిలిచిన నీరజ్‌కు డైమండ్ ట్రోఫీతో పాటు 30 వేల డాలర్లు (సుమారు రూ. 24 లక్షలు) ప్రైజ్‌మనీగా దక్కింది. ఎదురు లేని ప్రదర్శన... గాయం కారణంగా బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలకు దూరమైన నీరజ్ గత నెల 26న లాసానేలో జరిగిన డైమండ్ లీగ్ అంచెలో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. ఫలితంగా ఫైనల్స్‌కు అర్హత సాధించడంతో పాటు 2023లో జరిగే వరల్డ్ చాంపియన్‌షిప్‌కు కూడా క్వాలిఫై అయ్యాడు. గురువారం ఈవెంట్లో నీరజ్ తొలి ప్రయత్నం ‘ఫౌల్’ అయింది. అయితే రెండో ప్రయత్నంలో అతని జావెలిన్ 88.44 మీటర్లు దూసుకుపోయింది. తర్వాతి మరో నాలుగు ప్రయత్నాల్లోనూ (88 మీ., 86.11 మీ., 87 మీ., 83.60 మీ.) దీనికంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వలేకపోయినా... విజేతగా నిలిచేందుకు 88.44 మీటర్లు సరిపోయాయి. -
డైమండ్ లీగ్ ఫైనల్స్ బరిలో నీరజ్
ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఫైనల్స్ మీట్లో పసిడి పతకమే లక్ష్యంగా భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా బరిలోకి దిగనున్నాడు. జ్యూరిక్‌లో ఈరోజు డైమండ్ లీగ్ ఫైనల్స్ జరగనుంది. జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్‌తో కలిపి మొత్తం ఆరుగురు పోటీపడనున్నారు. 2017, 2018 డైమండ్ లీగ్ ఫైనల్స్ మీట్‌కు నీరజ్ అర్హత సాధించినా పతకం సాధించలేకపోయాడు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో సంచలనం సృష్టించిన నీరజ్ ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతంతో మెరిశాడు. -
డైమండ్ లీగ్ ఫైనల్‌కు నీరజ్ చోప్రా
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక ‘డైమండ్ లీగ్ ఫైనల్’ టోర్నీకి అర్హత సాధించాడు. ఇటీవల జరిగిన రాబట్ (మొరాకో) అంచె డైమండ్ లీగ్ సిరీస్‌లో నీరజ్ చోప్రా జావెలిన్‌ను అత్యుత్తమంగా 83.32మీ. దూరం విసిరి ఐదో స్థానంలో నిలిచాడు. తద్వారా 4 పాయింట్లు సాధించి జ్యూరిచ్‌లో ఆగస్టు 30న జరిగే ‘డైమండ్ లీగ్ ఫైనల్’కు అర్హత సాధించాడు. అంతకుముందు కూడా దోహా డైమండ్ లీగ్‌లో నాలుగో స్థానంలో నిలిచి 5 పాయింట్లు, యుజిన్ డైమండ్ లీగ్‌లో ఆరోస్థానంలో నిలిచి 3 పాయింట్లను సాధించాడు. -
‘రియో’ తర్వాత వీడ్కోలు: బోల్ట్
బ్రస్సెల్స్: అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడే అథ్లెటిక్స్ కెరీర్‌కు వీడ్కోలు పలకాలనుందని 100, 200 మీటర్ల ప్రపంచ చాంపియన్ ఉసేన్ బోల్ట్ తెలిపాడు. డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో పోటీపడేందుకు ఇక్కడకు వచ్చిన బోల్ట్ తన భవిష్యత్‌పై మాట్లాడాడు. ‘2016 రియో ఒలింపిక్స్‌లోనూ స్వర్ణ పతకాలు సాధించాలని ఉంది. ఆ తర్వాత రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తాను. నేను పూర్తి ఫిట్నెస్తో ఉంటే రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటాను. నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను. రిటైర్మెంట్కు అదే మంచి సమయమని భావిస్తున్నాను’ అని బోల్ట్ వ్యాఖ్యానించాడు. ‘మహ్మద్ అలీ, పీలే లాంటి దిగ్గజాల సరసన నా పేరూ చేరాలంటే అత్యున్నతస్థాయిలో ఉన్నపుడే ఆటకు గుడ్‌బై చెప్పాలి. వచ్చే ఏడాది గొప్ప ఈవెంట్స్ లేవు. స్కాట్లాండ్లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనాలో వద్దో నా కోచ్ నిర్ణయిస్తారు. 9.58 సెకన్లతో ఉన్న 100 మీటర్ల ప్రపంచ రికార్డును తిరగరాయడం చాలా కష్టం. అయితే గాయాలబారిన పడకుండా, మంచి ఫిట్నెస్తో ఉంటే 19.19 సెకన్లతో ఉన్న 200 మీటర్ల ప్రపంచ రికార్డును మెరుగుపర్చగలననే విశ్వాసం ఉంది’ అని బోల్ట్ తెలిపాడు.


