డైమండ్‌ లీగ్‌ ఫైనల్‌కు నీరజ్‌ చోప్రా  | Neeraj Chopra for the Diamond League Final | Sakshi
Sakshi News home page

డైమండ్‌ లీగ్‌ ఫైనల్‌కు నీరజ్‌ చోప్రా 

Jul 28 2018 1:44 AM | Updated on Jul 28 2018 1:44 AM

Neeraj Chopra for the Diamond League Final - Sakshi

భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ప్రతిష్టాత్మక ‘డైమండ్‌ లీగ్‌ ఫైనల్‌’ టోర్నీకి అర్హత సాధించాడు. ఇటీవల జరిగిన రాబట్‌ (మొరాకో) అంచె డైమండ్‌ లీగ్‌ సిరీస్‌లో నీరజ్‌ చోప్రా జావెలిన్‌ను అత్యుత్తమంగా 83.32మీ. దూరం విసిరి ఐదో స్థానంలో నిలిచాడు. తద్వారా 4 పాయింట్లు సాధించి జ్యూరిచ్‌లో ఆగస్టు 30న జరిగే ‘డైమండ్‌ లీగ్‌ ఫైనల్‌’కు అర్హత సాధించాడు. అంతకుముందు కూడా దోహా డైమండ్‌ లీగ్‌లో నాలుగో స్థానంలో నిలిచి 5 పాయింట్లు, యుజిన్‌ డైమండ్‌ లీగ్‌లో ఆరోస్థానంలో నిలిచి 3 పాయింట్లను సాధించాడు.    

Advertisement
 
Advertisement
Advertisement