లుసానే డైమండ్ లీగ్ మీట్‌కు సిద్ధం
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్‌లో మరో అంచె పోటీలకు సిద్ధమయ్యాడు. ఈ నెల 21న జరిగే లుసానే ఈవెంట్‌లో నీరజ్ పాల్గొంటున్నాడు. దోహా అంచెలో జావెలిన్‌ను 85.69 మీటర్ల విసిరిన నీరజ్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఇటీవల కామన్వెల్త్ క్రీడల్లో అతను 85.83 మీటర్ల త్రో విసిరి రజత పతకం గెలుచుకున్నాడు. గత ఏడాది సెపె్టంబర్‌లో గాయంతో ఆటకు దూరమైన తర్వాత కోలుకొని నీరజ్ డైమండ్ లీగ్ (దోహా), కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్నాడు. పునరాగమనంలో లుసానే మీట్ అతనికి మూడోది కానుంది.
తాజా ఈవెంట్‌లో 2020 టోక్యో ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత నీరజ్‌తో పాటు మరో ఐదుగురు అగ్రశ్రేణి త్రోయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2024 పారిస్ ఒలింపిక్స్ విజేత అర్షద్ నదీమ్ (పాకిస్తాన్), 2016 ఒలింపిక్ చాంపియన్ థామస్ రోలర్ (జర్మనీ), 2012 లండన్ ఒలింపిక్స్ విజేత కెషోర్న్ వాల్కాట్ (ట్రినిడాడ్) కూడా పోటీకి సిద్ధమయ్యారు. రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా)తో పాటు తాజా శ్రీలంక సంచలనం రుమేశ్ పతిరగే కూడా బరిలో నిలిచారు.


