ఈ సండే వెరైటీగా విదేశీ వంటకాలు ట్రై చేద్దాం ఇలా.. | Funday Special: Try This Sunday Foreign Variety Foods | Sakshi
Sakshi News home page

ఈ సండే వెరైటీగా విదేశీ వంటకాలు ట్రై చేయండిలా..

Jun 1 2025 5:13 PM | Updated on Jun 2 2025 8:44 AM

Funday Special: Try This Sunday Foreign Variety Foods

అమెరికన్‌ ఫ్రైడ్‌ స్ట్రాబెర్రీస్‌

కావలసినవి:  గుడ్డు– ఒకటి, పాలు– ఒక కప్పు, పంచదార– 3 టేబుల్‌ స్పూన్లు, నూనె– ఒక టేబుల్‌ స్పూన్, వెనీలా ఎసెన్స్‌– ఒక టీస్పూన్, మైదాపిండి– ఒకటిన్నర కప్పులు
బేకింగ్‌ పౌడర్‌– ఒక టేబుల్‌ స్పూన్‌
స్ట్రాబెర్రీలు– 10 లేదా 15

తయారీ: ముందుగా ఒక గిన్నెలో గుడ్డు, పాలు, పంచదార, నూనె, వెనీలా ఎసెన్స్‌ వేసి బాగా కలుపుకోవాలి. మరొక గిన్నెలో మైదాపిండి, బేకింగ్‌ పౌడర్‌ వేసికలుపుకోవాలి. ఇప్పుడు మైదా మిశ్రమంలో పాల మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకుంటూ, ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి మరీ పలుచగా లేదా మరీ గట్టిగా లేకుండా చూసుకోవాలి. 

ఇప్పుడు స్ట్రాబెర్రీలను శుభ్రంగా కడిగి, తొడిమలను తొలగించి పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని ఒక బాణలిలో నూనె వేడి చేసుకుని, డీప్‌ ఫ్రై చేసుకోవాలి. అనంతరం ఒక్కో స్ట్రాబెర్రీని మైదా– పాల మిశ్రమంలో ముంచి మళ్లీ నూనెలో వేయించుకోవాలి. కాస్త చల్లారగానే, నచ్చిన విధంగా కట్‌ చేసుకుని, చాక్లెట్‌ సిరప్‌తో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవచ్చు.

ఇటాలియన్‌ కాన్నోలి
కావలసినవి:  గుల్లల కోసం: మైదాపిండి– 2 కప్పులు, పంచదార పొడి– పావు కప్పు, దాల్చినచెక్క పొడి– అర టీస్పూన్, వెన్న– 3 టేబుల్‌ స్పూన్లు, మార్సాలా వైన్‌– అర కప్పు, నీళ్లు– 2 టేబుల్‌ స్పూన్లు, వెనిగర్‌– ఒక టేబుల్‌ స్పూన్, నూనె– డీప్‌ ఫ్రైకి సరిపడా, గుడ్డు– 2 క్రీమ్‌ కోసం: రికోటా చీజ్‌– 500 గ్రాములు, పంచదార పొడి– అర కప్పు, వెనీలా ఎసెన్స్‌– ఒక టీస్పూన్, దాల్చినచెక్క పొడి– అర టీస్పూన్, నిమ్మతొక్క తురుము– కొద్దిగాగార్నిష్‌ కోసం (అభిరుచిని బట్టి): చాక్లెట్‌ చిప్స్‌– కొన్నిపంచదార పొడి– కొద్దిగా, పిస్తా తరుగు– కొద్దిగా చెర్రీలు– కొన్ని

తయారీ: ముందుగా ఒక పెద్ద గిన్నెలో మైదాపిండి, పంచదార పొడి, దాల్చినచెక్క పొడి వేసి బాగా కలపాలి. వెన్న కరిగించి, మైదా మిశ్రమంలో వేసి ఉండలు లేకుండా చేసుకుని, మధ్యలో గుంతలా చేసుకోవాలి. అనంతరం దానిలో మార్సాలా వైన్, నీళ్లు, వెనిగర్, గుడ్లు (ఒక తెల్లసొన తీసి పక్కనపెట్టుకోవాలి) వేసుకుని బాగా ముద్దలా కలుపుకోవాలి. 

అవసరం అయితే నీళ్లు కలుపుకోవచ్చు. ఇప్పుడు ఆ మిశ్రమానికి క్లాత్‌ చుట్టి రెండుగంటలు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని, కాస్త కోలగా చపాతీలు మాదిరి ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక్కో చపాతీని కాన్నోలి ట్యూబ్‌కి చుట్టి, రెండు అంచులు అతుక్కునే చోట గుడ్డు తెల్లసొన కొద్దిగా రాస్తే అది ఊడిపోదు. ఇప్పుడు అన్నీ చపాతీలు అలానే చేసుకుని మరుగుతున్న నూనెలో వేసుకుని దోరగా వేయించుకోవాలి. 

చల్లారాక కాన్నోలి ట్యూబ్‌లను తొలగిస్తే, చిత్రంలో కనిపిస్తున్న గుల్లల మాదిరి ఉంటాయి. అనంతరం ఒక గిన్నెలో రికోటా చీజ్‌ను హ్యాండ్‌ బ్లెండర్‌తో క్రీమీగా చేసుకుని దానిలో పంచదార పొడి, వెనిల్లా ఎసెన్స్‌ దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు మైదా మిశ్రమంతో తయారుచేసిన గుల్లల్లో ఈ మిశ్రమం నింపుకుని, పిస్తా ముక్కలు, చాక్లెట్‌ చిప్స్, పంచదార పొడి, చర్రీస్‌ ఇలా నచ్చిన వాటితో, నచ్చిన విధంగా గార్నిష్‌ చేసుకోవచ్చు. 

(చదవండి: Jamai Sasthi: కొత్త అల్లుడికి కొసరి..కొసరి..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement