
గ్రాజ్: ఆస్ట్రియా దేశం గ్రాజ్ నగరంలో ఘోరం జరిగింది. బోర్గ్ డ్రైయర్షుట్సెన్గాసే హై స్కూల్లో ఓ విద్యార్థి తోటి విద్యార్థులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ దారుణంలో 11 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
గ్రాజ్ నగరం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల ప్రాంతంలో నిందితుడు గన్నుతో కాల్పులు జరిపినట్లు తమకు సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు. అయితే, కాల్పుల అనంతరం విద్యార్థి తనని తాను గన్నుతో కాల్చుకొని ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
దాడి తర్వాత, గ్రాజ్ పాఠశాలను ఖాళీ చేయించారు. విద్యార్థులను సమీపంలోని హెల్మట్ లిస్ట్ హాల్‌కు తరలించారు.అక్కడ వారికి రెడ్‌క్రాస్ చికిత్స అందించింది. ఘటనపై అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాల్పుల శబ్ధం విన్న వెంటనే పోలీసులు స్థానికుల్ని అప్రమత్తం చేశారు. కాల్పులు జరిగిన ప్రాంత ప్రజలు బహిరంగంగా తిరగకూడదని, ఇళ్లలోనే ఉండాలని సూచించారు.
🚨🇦🇹 MULTIPLE DEAD IN AUSTRIAN SCHOOL SHOOTING
A shooting at BORG Dreierschützengasse school in Graz, Austria, has left at several dead, including students and teachers, with many injured.
Local media reported at least 8 dead, but authorities have not released the official… pic.twitter.com/7Lqy7GjcAu— Mario Nawfal (@MarioNawfal) June 10, 2025