
వాషింగ్టన్: భారత్- పాక్‌లలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అమెరికా అనుక్షణం గమనిస్తున్నదని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వెల్లడించారు. సుదీర్ఘ ఘర్షణల తర్వాత కాల్పుల విరమణను కొనసాగించడం సవాలుగా మారుతుందని అందుకే అమెరికా.. భారత్-పాక్‌లపై ఓ కన్నేసి ఉంచిందని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచంలోని ఇతర ఉద్రిక్తతల దేశాలతో పాటు భారత్-పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న పరిస్థితిని అమెరికా ప్రతిరోజూ గమనిస్తున్నదని, ప్రస్తుత, భావి సంఘర్షణలను నిరోధించే శాంతి ఒప్పందం లక్ష్యంగా అమెరికా దృష్టి సారించిందని రూబియో అన్నారు. ‘ప్రతిరోజూ పాకిస్తాన్-భారతదేశం మధ్య ఏమి జరుగుతున్నదో, కంబోడియా- థాయిలాండ్ మధ్య ఏమి చోటుచేసుకుంటున్నదో తాము నిరంతరం గమనిస్తూనే ఉన్నామని రూబియో మీడియాకు తెలిపారు. ఇరు దేశాల మధ్య ఘర్షణలు తలెత్తినప్పుడు అమెరికా కాల్పుల విరమణకు పిలుపునిస్తున్నదని, అయితే శత్రుత్వం కొనసాగుతున్నప్పుడు చర్చలు జరపడం కష్టమని రూబియో తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
Hopefully everybody is OK in South Provo where there’s a large fire raging on the mountain side within the last hour. pic.twitter.com/f96mSWMVH3
— Jarom Jordan (@jaromjordan) August 17, 2025
యుద్ధ విరమణకు ఏకైక మార్గం ఇరుపక్షాలు పరస్పరం కాల్పుల విరమణకు అంగీకరించడమేనన్నారు. అయితే రష్యన్లు ఇందుకు అంగీకరించలేదని, ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ప్రస్తావిస్తూ ఆయన అన్నారు. సుదీర్ఘ ఘర్షణల తర్వాత కాల్పుల విరమణ అనేది చాలా త్వరగా విచ్ఛిన్నమవుతుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం మాత్రమే కాకుండా, భవిష్యత్తు సంఘర్షణలను నిరోధించేలా శాంతి ఒప్పందం కుదరడం లక్ష్యంగా ఉండాలని రూబియో పేర్కొన్నారు.
కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలో తాను భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించానని, పదేపదే చెబుతూ వచ్చారు. తన జోక్యంతో రెండు అణ్వాయుధ దేశాల మధ్య కాల్పుల విరమణకు సహకరించానని ట్రంప్ వాదించారు. అయితే భారత్ ఈ వాదనలను తిరస్కరించింది. పాకిస్తాన్‌తో నెలకొన్న అన్ని సమస్యల పరిష్కారం ద్వైపాక్షికంగానే జరుగుతున్నదని, మూడవ పక్షం మధ్యవర్తిత్వం పాత్ర ఏమీలేదని స్పష్టం చేసింది.