అతిచిన్న అంతర్జాతీయ వారధి..! | The Worlds Shortest International Bridge Connects Spain And Portuguese, Know Facts About This Bridge In Telugu | Sakshi
Sakshi News home page

అతిచిన్న అంతర్జాతీయ వారధి..!

Apr 6 2025 12:26 PM | Updated on Apr 6 2025 2:33 PM

The Worlds Shortest International Bridge Connects Spain And Portuguese

ఇది ప్రపంచంలోనే అతి చిన్న అంతర్జాతీయ వారధి. కేవలం కొన్ని అడుగులు వేసి, ఈ వంతెనను ఇట్టే దాటేయవచ్చు. దీని మీదుగా స్పెయిన్‌ నుంచి పోర్చుగల్‌ దేశానికి వెళ్లొచ్చు. దీనిని ‘మార్కో ఇంటర్‌నేషనల్‌ బ్రిడ్జ్‌’ అని పిలుస్తారు. 

కేవలం 6 మీటర్ల పొడవు, 1.45 మీటర్ల వెడల్పుతో ఈ వంతెనను 2008లో నిర్మించారు. స్పెయిన్‌లోని ఎల్‌ మార్కో గ్రామం నుంచి పోర్చుగల్‌ గ్రామమైన వర్జియా గ్రాండ్‌ల మధ్య ఉండే చిన్న వాగును దాటేందుకు, వెదురు బొంగులతో దీనిని నిర్మించారు. 

ఈ వంతెన రెండు వేర్వేరు టైమ్‌జోన్‌ల పరిధిలో ఉంది. స్పెయిన్‌ వైపు సెంట్రల్‌ యూరోపియన్‌ టైమ్‌ (సీఈటీ) జోన్‌లోను, పోర్చుగీస్‌ వైపు గ్రీన్విచ్‌ మీన్‌ టైమ్‌ (జీఎంటీ) జోన్‌లోను ఉండటం విశేషం. దీని మీదుగా ప్రయాణిస్తే, టైమ్‌ ట్రావెల్‌ చేసిన అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. 

దీని మీదుగా కేవలం పాదచారులు, ద్విచక్ర వాహనాలు మాత్రమే ప్రయాణించడానికి వీలవుతుంది. పర్యాటకులకు ఇదొక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రోజూ వందలాది మంది ఈ వంతెనను దాటుతూ టైమ్‌ ట్రావెలింగ్‌ చేసిన అనుభూతిని పొందుతున్నారు. 

(చదవండి: krithi shetty: నీలిరంగు డ్రెస్‌లో బేబమ్మ బ్యూటీ లుక్స్‌..ధర తెలిస్తే షాకవ్వుతారు..!)


 

Advertisement
 
Advertisement
Advertisement