సిల్క్‌ షర్ట్‌, జీన్స్‌లో మోడ్రన్‌ సీతలా సాయిపల్లవి! | Sai Pallavi spotted A Silk Shirt And Jeans At London Ramayana Promotions | Sakshi
Sakshi News home page

సిల్క్‌ షర్ట్‌, జీన్స్‌లో మోడ్రన్‌ సీతలా సాయిపల్లవి!

Nov 3 2026 1:24 PM | Updated on Nov 3 2026 1:37 PM

Sai Pallavi spotted A Silk Shirt And Jeans At London Ramayana Promotions

రామాయణ చిత్ర బృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ప్రస్తుతం లండన్‌లో ఉంది ఈ సినీ బృందం. అక్కడ తమ మూవీ ప్రమోషన్లతో సందడి చేశారు. అయితే ఈ బృందం ఎప్పటిలానే సాంప్రదాయ దుస్తులకు బదులుగా క్యాజువల్‌ చిక్‌ దుస్తులలో మెరిశారు. ఇప్పటివరకు తమ మూవీ ‍ప్రమోషన్లలో చాలా మటుకు రణబీర్‌, యష్‌, సాయిపల్లవి, సాంప్రదాయ ఇండో వెస్ట్రన్‌ దుస్తులను ఎంచుకున్నారు. ఈసారి నిరాడంబరమైన ఆధునిక లుక్‌ని జోడించారు. 

ముఖ్యంగా సీతలా నటించి సాయిపల్లవి నల్లటి జీన్స్‌లో కనిపించింది. జారా బ్రాండ్‌కు చెందిన జీన్స్‌ ధరించిందామె. దీనికి మడతపెట్టగల బెలూన్‌ ఫిట్‌ మిడ్‌ వేస్ట్‌ జాక్వర్డ్‌ జీన్స్‌ విత్‌ ఐదు పాకెట్లు, బెల్ట్‌ లూప్‌లు, ముందువైపు  జిప్‌, జాక్వర్డ్‌ ప్రింట్‌ తదితరాలు ఉన్నాయి. దీనికి జతగా మ్యాండరిన్ కాలర్, వదులుగా పూర్తిగా చేతులున్న లేత గోధుమ రంగు సిల్క్‌ షర్ట్‌ని జత చేసింది. దీనికి తగినట్లుగా ఉంగరాల జుట్టుని వదులుగా వదిలేసింది. 

ఈ కార్యక్రమంలో నటీనటులతో పాటు నిర్మాత నమిత్‌ మల్హోత్రా, దర్శకుడు నితేష్‌ తివారీ తదితరులు కూడా పాల్గొన్నారు. కాగా హీరో రణబీర్‌ కపూర్‌ నీలిరంగు జీన్స్, నలుపు రంగు టీ-షర్ట్, నలుపు రంగు జాకెట్‌లో మెరిశాడు. అందుకు తగినట్లుగా కళ్లకు బ్లాక్‌ సన్‌గ్లాసెస్‌, బూడిద రండు బూట్లు, నీలిరంగు వాచ్‌తో తన లుక్‌ని పూర్తి చేశాడు. 

ఇక యష్‌ నీలిరంగు రిప్డ్ జీన్స్, బ్రౌన్ టీ-షర్ట్,  బ్రౌన్ లెదర్ జాకెట్‌ను ఎంచుకున్నాడు.యష్‌ కూడా తన ఆహార్యానికి అనుగుణంగా బ్రౌన్‌ రంగు కళ్లద్దాలు, బ్రౌన్‌ స్వెడ్‌ షూస్‌తో తన లుక్‌ని పూర్తి చేశాడు. కాగా, నమిత్‌ మల్హోత్రా నిర్మించిన  'రామాయణం', రెండు భాగాల రూపంలో విడుదల కానుంది. దీన్ని సుమారు రూ. 4 వేల బడ్జెట్‌తో తెరకెక్కించారు.

 

ఇదీ చదవండి: ఆకలిని జయించిన పట్టుదల..నిరాహారంగానే చార్‌ధామ్‌ యాత్ర!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement