
విజయవాడ శ్రీధర్ సీసీఈలో ఇంటర్నేషనల్ కాయిన్ ఎక్స్పో పేరిట శుక్రవారం ఏర్పాటు చేసిన నాణేలు, కరెన్సీ నోట్లు, స్టాంపుల ప్రదర్శన ఆకట్టుకుంటోంది

ఈ ప్రదర్శన మూడు రోజులు నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనకు శుక్రవారం విద్యార్థులు క్యూ కట్టారు

ఎక్స్‌పోలో మలేసియా 60వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రూపొందించిన ప్రపంచంలోనే అతిపెద్ద నోటు రిన్గిట్ మలేసియా( ఆర్ఎం 600) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

పర్యావరణంపై 145 దేశాలు ముద్రించిన 613 రకాల నాణేలు, వైల్డ్‌లైఫ్‌పై వివిధ సందర్భాల్లో 120 దేశాలు ముద్రించిన నాణేలు వీక్షకులను కట్టిపడేస్తున్నాయి

వైల్డ్‌లైఫ్ విభాగంలో ఫ్లైయింగ్ ఫిష్ నాణేన్ని విద్యార్థులు ఫొటోలు తీసుకుంటున్నారు

ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ సెంటెడ్ స్టాంపులు ఆకర్షిస్తున్నాయి

ఈ ప్రదర్శన విద్యార్థులకు విజ్ఞాన సముపార్జనకు తోడ్పాటును అందిస్తోంది





















