ఆఫ్రికా దేశం ఇథియోపియాలోని హైలీ గుబ్బి అగ్నిపర్వతం(Hayli Gubbi ) దాదాపు 10,000 సంవత్సరాల తర్వాత విస్ఫోటనం చెందింది. నవంబర్ 23 ఉదయం డనాకిల్ డిప్రెషన్ ప్రాంతంలో ఈ విస్ఫోటనం గుర్తించబడింది. భూమి క్రింద నిశ్శబ్దంగా ఉన్న ఈ షీల్డ్ వోల్కానో నుంచి 15 కిలోమీటర్ల ఎత్తుకు బూడిద ఎగసి పడుతూ ఆకాశాన్ని కమ్మేసింది.
టూలూస్ వోల్కానిక్ యాష్ అడ్వైజరీ సెంటర్ (VAAC) నివేదిక ప్రకారం.. ఇది అత్యంత అరుదైన విస్పోటనం, ఎర్ర సముద్రం దాటి యెమెన్, ఒమాన్ వైపు వోలకనో కదులుతోంది. ఈ ప్రాంతం అత్యంత వేడి, చేరుకోవడం కష్టమైనది. అందువల్ల భూగర్భ పరిశోధకులు ఉపగ్రహ డేటా, వాతావరణ రీడింగ్స్ ఆధారంగా మాత్రమే పరిశీలిస్తున్నారు.
హైలీ గుబ్బి అగ్నిపర్వతం హోలోసీన్ కాలంలో(ఐస్ ఏజ్ ముగిసిన తర్వాత.. 11,700 సంవత్సరాల కాలం) ఎప్పుడూ విస్ఫోటనం కాలేదని నిర్ధారించుకున్నారు. ఈ విస్ఫోటనం ఆఫ్రికా కొమ్ము ప్రాంతంలో(హార్న్ ఆఫ్ ఆఫ్రికా) దశాబ్దాల తర్వాత జరిగిన అత్యంత ముఖ్యమైన అగ్నిపర్వత సంఘటనగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
సల్ఫర్ డయాక్సైడ్ స్థాయిలు పెరగడంతో ఒమన్, యెమన్ ప్రాంత ప్రజలకు జాగ్రత్త సూచనలు జారీ చేశారు. ఎయిర్ క్వాలిటీ వార్నింగ్ నేపథ్యంలో శ్వాసకోశ సంబంధ సమస్యలున్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కొన్ని మార్గాల్లో విమానాలు మళ్లించబడ్డాయి. ఉత్తర భారతదేశం వైపుగా దీని ప్రభావం ఉండే అవకాశం నెలకొంది. దీంతో.. భారత విమానయాన అధికారులకు అలర్ట్ జారీ అయ్యింది నవంబర్ 24న కన్నూర్ నుంచి అబుదాబీ వెళ్తున్న ఇండిగో విమానం (6E 1433) అహ్మదాబాద్‌కు మళ్లించబడింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
❗️🌋🇪🇹 - Ethiopia's Hayli Gubbi Volcano Awakens After 10,000 Years
In a stunning geological event, Ethiopia's Hayli Gubbi volcano—long dormant in the remote Danakil Depression of the Afar Rift—erupted explosively for the first time in recorded history on November 23, 2025.
The… pic.twitter.com/bZby4sAuOC— 🔥🗞The Informant (@theinformant_x) November 24, 2025


