నిన్న దుబాయ్‌లో జరిగిన ఎయిర్‌షోలో తేజస్ ఫైటర్ కుప్పకూలడంతో భారత ఫైలట్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ దుర్ఘటన వివరాలు యూట్యూబ్ రీల్స్ చూస్తుండగా తెలిసిందని ఆయన తండ్రి మీడియాతో తెలిపారు. ఈ ఘటన వివరాలు తెలియగానే తన కోడలికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.
ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు గొప్ప స్థానాల్లో ఉంటే చూడాలని కలలుగంటారు. ఇక వారి పిల్లల గొప్పతనాన్ని ఏవరైనా ప్రశంసిస్తే ఇక వారి ఆనందానికి అవదులే ఉండవు. అయితే తమ పిల్లల గొప్పతనాన్ని చూసి సంబరపడిపోదామనుకున్న తల్లిదండ్రులకు వారు మృతిచెందడం చూడాల్సి వస్తే ఇక ఆ బాధ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఆ సమయంలో వారు ప్రత్యక్ష నరకమే అనుభవిస్తారు. నిన్న దుబాయ్‌లో జరిగిన ఎయిర్‌షో అటువంటి చేదు జ్ఞాపకాన్నే మిగిల్చింది. దుబాయ్ లో జరిగిన ఎయిర్ షో సామాజిక మాధ్యమాల్లో ప్రసారమవుతుందని దానిని చూడాలని వింగ్ కమాండర్ నమాన్ష్ సయాల్ తన తండ్రికి చెప్పారు. దీంతో ఎంతో సంబురంగా తన కొడుకు ప్రతిభను చూడాలనుకున్న తండ్రికి ప్రమాదంలో కుమారుడు మృతి చెందడం చూడాల్సి వచ్చింది.
దుబాయ్ లో జరిగిన ఎయిర్ క్రాష్ ఘటనపై వింగ్ కమాండర్ నమాన్ష్ సయీల్ తండ్రి స్పందించారు. " నిన్న 4 గంటల ప్రాంతంలో ఎయిర్ షో లైవ్ వీడియోల కోసం యూట్యూబ్ లో వెతుకుతున్నాను. అప్పుడే జెట్ క్రాష్ అయిందనే సంగతి నాకు తెలిసింది. దీంతో వెెంటనే తన కోడలుకు కాల్ చేశానని, కొద్ది సేపటికే ఐదుగురు ఎయిర్ ఫోర్స్ అధికారులు తమ ఇంటికి రావడంతో ఎదో జరిగిందని నాకు అర్థమైంది" అన్నారు. ఈ ప్రమాద ఘటనకు ఒకరోజు ముందే తన కొడుకుతో మాట్లాడనని ఎయిర్ షో టీవీలో వస్తుంది చూడాలని తనకు తెలిపాడన్నారు.
నమాన్ష్ సయీల్ తండ్రి హిమాచల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా రిటైరయ్యారు. సయీల్ భార్య సైతం ఐఏఎఫ్ లో వింగ్ కమాండర్‌గా విధులు నిర్వహిస్తుంది. నిన్న దుబాయ్ లో జరిగిన ఎయిర్ షోలో ప్రమాదవశాత్తు తేజస్ ఫైటర్ కూలి వింగ్ కమాండర్ సయీల్ మృతి చెందారు.


