
అబుదాబిలో ఆధ్యాత్మికత వెల్లివిరవడం అనేది ఆశ్చర్యాన్ని రేకెత్తించే అంశం. అసలు అక్కడ హిందూ దేవాలయాలా..! అనే అనిపిస్తుంది గానీ నమ్మశక్యంగా ఉండదు. కానీ ఇది నిజం అనేలా కళ్లముందు కదాలాడుతున్న ఆ వైరల్ వీడియోనే అందుకు నిదర్శనం. ఆ హారతి ఘటన చూస్తే..మనం దుబాయ్‌లో ఉన్నామా? కాశీలో ఉన్నామా..? అన్న సందేహం రాక మానదు. మరి ఆ కథా కమామీషు ఏంటో చదివేద్దాం రండి..
ఇటీవల దుబాయ్‌కు వెళ్లిన ఒక భారతీయుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుదాబిలోని బోచసన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ(BAPS) హిందూ మందిర్‌లో గంగా హారతి చూసి తన్మయత్వానికి గురయ్యాడు. యూఏఈకి మకాం మార్చిన మూడు వారాల తర్వాత ఈ 24 ఏళ్ల వ్యక్తి ఈ ఆలయ సందర్శన వీడియోని నెట్టింట పంచుకున్నాడు. రెండు వారాలు ఒక హోటల్‌లో గడిపి..చివరికి ఒక కొత్త ఇంట్లోకి మారిన తర్వాత ఈ ఐకానికి ఆలయాన్ని అన్వేషించాడు.
ఒక వీక్‌ఆఫ్(సెలవు) రోజున ఈ ఆలయాన్ని సందర్శించి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని పొందాడు. అక్కడ గంగా హారతిని చూసి తన దేశంలోనే ఉన్నానా అన్న బ్రాంతిని పొందానంటూ అందుకు సంబంధించిన వీడియోని నెటిజన్లతో పంచుకున్నాడు. ఆ వీడియోకి నేను "నేను UAEలో గంగా హారతిని చూశాను" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్ చేశాడు. విదేశాలలో భారతీయ సంస్కృతిని పరిరక్షించడంలో ఈ ఆలయాల పాత్ర హైలెట్‌గా నిలుస్తుంది. BAPSకి చెందిన ఈ ప్రార్థనా స్థలాలు మంచి ఆధ్యాత్మిక ఓదార్పుని అందిస్తాయి.
తాము వేరు అనే భావన కాకుండా తన స్వదేశం మూలాలు, సంస్కృతితో గాఢంగా పెనవేసుకునేందుకు ఉపకరిస్తుంది కూడా. కాగా, ఈ ఆలయంలో రోజువారి గంగా ఆరతి వేడుకలను నిర్విఘ్నంగా నిర్వహిస్తారు. ఇక ఈ అబుదాబిలోని బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ హిందూ మందిర్ (BAPS) 27 ఎకరాల స్థలాన్ని విస్తరించి ఉంది.
దీన్ని UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఉదారంగా ఇచ్చిన 13.5 ఎకరాల స్థలంలో నిర్మించడం విశేషం. ఈ ఆలయాన్ని 2019లో నిర్మించారు. అందుకు 400 మిలియన్ యుఏఈ దిర్హామ్‌లు అంటే మన భారతీయ కరెన్సీలో అక్షరాల రూ. 961 కోట్లు పైనే ఖర్చు అయ్యింది.
(చదవండి: నైట్ ఈటింగ్ సిండ్రోమ్..! ఆరోగ్యాన్ని అమాంతం తినేస్తుంది..)