
మన దేశంలో బెంగళూరు ట్రాఫిక్‌కంటూ (Bengaluru Traffic) ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. నిత్యం ఆ ట్రాఫిక్‌లో నరకం అనుభవించేవాళ్లకే ఆ బాధేంటో తెలుస్తుంది. ఇటు.. సోషల్ మీడియాలో దీనిపై నడిచే చర్చ అంతా ఇంతా కాదు. అలా అక్కడి పరిస్థితులపై ఓ పోస్టు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
దుబాయ్ వెళ్తున్న తన స్నేహితురాలిని ఒకడు బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగబెట్టాడట. తిరిగి తాను ఇంటికి వెళ్లే క్రమంలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాడట. అలా ఆమె దుబాయ్‌కి చేరుకుంటే.. అతను మాత్రం ఇంకా ఆ ట్రాఫిక్‌లోనే ఉండిపోయాడట. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అకౌంట్ ఎక్స్ అకౌంట్‌లో ఈ వీడియో షేర్ అయ్యింది.
బెంగళూరుకు చెందిన @bengalurupost1 యూజర్ ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇదెంత వరకు నిజం? అని ప్రశ్నిస్తున్నాడు. అయితే ఇది సెటైరికల్ పోస్టే అని స్పష్టమవుతున్నా.. సరదాగా కాసేపు కామెంట్లతో బెంగళూరు ట్రాఫిక్ కష్టాలపై జోకులు పేలుస్తున్నారు.
How true is this #Bengaluru? pic.twitter.com/02v0KwngoA
— Bengaluru Post (@bengalurupost1) July 18, 2025
ఇదిలా ఉంటే.. ఇటు గురుగ్రామ్‌కు చెందిన ఓ ట్రాఫిక్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వర్షం పడడంతో నీరు నిలిచిపోయి.. నెమ్మదిగా వాహనాలు ముందుకు సాగుతున్న దృశ్యాలు అవి. అయితే దానికి కూడా బెంగళూరుకు ముడిపెట్టి జోకులు పేలుస్తున్నారు. ఇది బెంగళూరు ట్రాఫిక్ కంటే ఎంతో నయం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి: బెంగళూరు ట్రాఫిక్ సమస్య చెక్ ఇలా..