సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా వైఎస్ జగన్ గుంటూరు పర్యటన
హోరెత్తిన జనహృదయ విజేత పేరు
అదరని, బెదరని గుండె అది అంటూ పోస్టులు వైరల్
గ్రూపుల్లో షేర్ చేస్తూ షేక్ చేస్తున్న నెటిజన్లు
సాక్షి, అమరావతి: ‘జగనన్న 2.0 లోడింగ్’.. అంటూ సామాజిక మాధ్యమాల్లో వైఎస్ జగన్ పేరు హోరెత్తిపోతోంది. మాజీ మంత్రి అంబటిపైనా, ఆయన ఇంటిపైనా కూటమి రౌడీ మూకల దాడి నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్ బుధవారం గుంటూరు వెళ్లారు. ఈ సందర్భంగా ఉవ్వెత్తున జన అభిమాన తరంగం ఎగిసిపడింది. కార్యకర్తలకు జగన్ అండగా ఉంటాడని, ఎవరికీ భయపడేది లేదనే మీమ్స్‌ను నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు.

జగన్ కాన్వాయ్ వీడియోలను వైరల్ చేస్తున్నారు. జగన్ పర్యటనకు జనం భారీ స్థాయిలో రావడం అనేది సహజం. కానీ అంతే స్థాయిలో ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఆయనకు మద్దతు లభిస్తుండటం, వాట్సప్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో, వాటి గ్రూపుల్లో లెక్కకు మించి జగన్ పర్యటనపై పోస్టులను నెటిజన్లు షేర్ చేస్తుండటం విశేషం.



