
దక్షిణాదిలో ప్రతిష్టాత్మక సినీ పండుగ తేదీలు ఖరారు చేశారు. సౌత్ ఇండస్ట్రీలో అందించే ప్రముఖ సైమా అవార్డుల వేడుక జరిగే వేదికను కూడా నిర్ణయించారు. ఈ ఏడాది జరగనున్న 13వ ఎడిషన్ అవార్డుల వేడుకను దుబాయ్లోనే నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 5,6 తేదీల్లో ఈ గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు నిర్వాహకలు వెల్లడించారు.
దక్షిణాది సినిమాల్లో ప్రతిభ కనబరిచిన నటీనటులకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులు అందజేయనున్నారు. ఇప్పటివరకు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ పేరిట 12 ఎడిషన్లు పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించిన నామినేషన్స్ జాబితాను త్వరలోనే విడుదల చేయనున్నారు. గత రెండేళ్లుగా ఈ వేడుకను దుబాయ్లోనే నిర్వహిస్తున్నారు. ఈసారి అక్కడే సినీ అవార్డుల వేడుక సైమా జరగనుంది.
The biggest celebration of South Indian Cinema is back!
Dubai 5th & 6th September
Get ready for SIIMA's 13th edition, where stars shine the brightest!@BrindaPrasad1 @vishinduri#SIIMA2025 #NEXASIIMA #SouthIndianCinema #dubai pic.twitter.com/AC2iihRNib— SIIMA (@siima) July 18, 2025