
దక్షిణాది సినీ అవార్డుల పండుగ సైమా(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) ఈ ఏడాది సెప్టెంబర్లో జరగనుంది. ఇప్పటికే వేదికతో పాటు తేదీలను నిర్వాహకులు ప్రకటించారు. తాజాగా ఈ అవార్డులకు ఎంపికైన నామినేషన్స్ జాబితాను వెల్లడించారు. బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచిన దక్షిణాది సినిమాలు ఈ అవార్డుల కోసం పోటీపడుతున్నాయి. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఎంపికైన చిత్రాల జాబితాను తాజాగా సైమా అవార్డుల కమిటీ ప్రకటించింది.
తెలుగు సినిమాల విషయానికొస్తే అత్యధికంగా పుష్ప-2 చిత్రం నామినేషన్స్ దక్కించుకుంది. ఏకంగా 11 విభాగాల్లో ఎంపికైంది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన కల్కి మూవీ పది నామినేషన్స్తో రెండో ప్లేస్లో నిలిచింది. అంతేకాకుండా తేజ సజ్జా-ప్రశాంత్ వర్మ చిత్రం హను మాన్ కూడా 10 విభాగాల్లో నామినేషన్స్ సొంతం చేసుకుంది. కాగా... గతేడాదిలో రిలీజైన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచాయి.
ఇక కోలీవుడ్ విషయానికొస్తే శివ కార్తికేయన్- సాయిపల్లవి జంటగా వచ్చిన అమరన్ 13 నామినేషన్స్ దక్కించుకుంది. లబ్బర్ పందు 8, వాజై 7 విభాగాల్లో నిలిచాయి. ఇక శాండల్వుడ్లో భీమా, కృష్ణ ప్రణయ సఖి చిత్రాలు తొమ్మిది విభాగాల్లో నామినేషన్స్ సాధించాయి. ఇబ్బని తబ్బిడ ఇలియాలి - 7 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుంది. అలాగే మలయాళం పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా వచ్చిన ది గోట్ లైఫ్(ఆడుజీవితం) అత్యధికంగా 10 విభాగాలకు ఎంపికైంది. ఆ తర్వాత ఏఆర్ఎమ్ 9, ఆవేశం 8 నామినేషన్స్ దక్కించుకున్నాయి. ఈ 13వ సైమా అవార్డుల వేడుక దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 5,6 తేదీల్లో జరగనుంది.
The Stage Is Set. The Stars Are Ready.
Presenting the Top Nominated Films at SIIMA 2025 🌍🏆
From powerful performances to cinematic brilliance, these films captured hearts and headlines across languages. And now… they lead the race for the most coveted awards in South Indian… pic.twitter.com/Vx2dLOOGLO— SIIMA (@siima) July 23, 2025