
నటిగా, నిర్మాతగా, హోస్ట్‌గా తన సత్తా చాటుకుంది మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna). అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంది. టీచ్ ఫర్ ఛేంజ్ అనే స్వచ్చంద సంస్థను స్థాపించి పలు ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా తయారు చేసింది. ఇప్పటివరకు పదుల సంఖ్యలో ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకున్న ఆమె వేలాది మంది విద్యార్థులకు స్మార్ట్ క్లాస్ విద్యను అందించింది.
'మంచు'లాంటి మనసు
విద్యాదానం కంటే గొప్పది మరొకటి ఉండదని బలంగా నమ్ముతుంది లక్ష్మి. తాజాగా నెల్లూరులోని కోటమిట్టలో డిజిటల్ క్లాసు రూముల ప్రారంభోత్సవంలో పాల్గొంది. క్లాసును అందంగా తీర్చిదిద్దడంతోపాటు గదిలో ఓ టీవీని కూడా ఏర్పాటు చేయించింది. జిల్లాలోని 12 స్కూళ్లలో రూ.2 లక్షల చొప్పున నిధులతో టీవీ, తదితర సౌకర్యాలతో డిజిటల్ క్లాస్‌రూమ్స్ ఏర్పాటు చేయించింది మంచు లక్ష్మి.