
యాంకర్గా కెరీర్ మొదలుపెట్టి తెలుగు స్టార్గా ఎదిగిన నటి అనసూయ. రంగస్థలంలో రంగమ్మత్తగా.. పుష్ప చిత్రంలో దాక్షాయణి పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్గా ఉంటోన్న అనసూయ.. తాజాగా తన ఫ్యాన్స్‌తో మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
తాను ఓ వీఎఫ్‌ఎక్స్ కంపెనీలో పనిచేశానని అనసూయ తెలిపింది. అక్కడంతా వెట్టిచాకిరి చేయాల్సిందేనని.. ఎనిమిది గంటల పాటు వర్క్ చేయాలనే రూమ్ ఏమి ఉండదని చెప్పింది. ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ఇచ్చిన టైమ్లోనే ఫినిష్ చేయాలని అనసూయ వివరించింది. టైమ్లోనే తనను సుకుమార్, మెహర్ రమేశ్, త్రివిక్రమ్ లాంటి వాళ్లు తనను చూశారని వెల్లడించింది. ఎన్టీఆర్ నటించిన కంత్రి సినిమాకు మా టీమ్ వర్క్ చేసిందని.. అప్పుడు నేను కౌన్సిలర్గా, హెచ్‌ఆర్ ఉన్నానని అనసూయ వివరించింది. హాలీవుడ్తో పాటు తెలుగులో పలు సినిమాలకు వీఎఫ్ఎక్స్ చేశామని తెలిపింది.
వీఎఫ్ఎక్స్లో కంపెనీలో పని చేసే సమయంలో తాను డేటింగ్లో ఉన్నానని అనసూయ రివీల్ చేసింది. నా లైఫ్లో ఒక్కరే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని.. అతన్నే పెళ్లి చేసుకున్నాని వెల్లడించింది. అంతేకాకుండా తనకు పవిత్ర అనే పేరు మా అమ్మ పెట్టాలని అనుకుందని తెలిపింది. కానీ నాన్న వాళ్ల అమ్మగారి పేరు పెడదామని అనసూయ పెట్టేశారు. మా ముగ్గురికి అనసూయ, అంబిక, సాయి వైష్ణవి అని పెట్టారని గుర్తు చేసుకుంది.
When I Was Working At VFX Company, Director @MeherRamesh Garu Saw Me & At That Time I Did Work For The Film Called #Kantri & There Is Small Anime Of Jr Ntr @tarak9999 Garu & We Worked On It - @anusuyakhasba Garu..#ManOfMassesNTR @tarak9999 pic.twitter.com/S6RH8nJWLF
— 𝐓𝐞𝐚𝐦 𝐅𝐨𝐫 𝐓𝐚𝐫𝐚𝐤 (@TeamForTarak) July 23, 2025