సైమా అవార్డ్స్‌-2025 విజేతలు వీరే.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ | SIIMA Awards 2025 Tollywood Full Winners List And Details | Sakshi
Sakshi News home page

సైమా అవార్డ్స్‌-2025 విజేతలు వీరే.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌

Sep 6 2025 5:37 AM | Updated on Sep 6 2025 8:34 AM

SIIMA Awards 2025 Tollywood winners full details

దుబాయ్‌లో సైమా అవార్డ్స్‌ (South Indian International Movie Awards 2025) వేడుక ఘనంగా ప్రారంభమైంది. దక్షిణాదిలో ప్రతిష్టాత్మకంగా భావించే సైమా (SIIMA) అవార్డ్స్‌కు ఎంతో గుర్తింపు ఉంది. సౌత్‌ చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటులు సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి వారిని అవార్డ్‌తో సైమా గౌరవిస్తుంది. 2024లో సెన్సార్‌ అయిన చిత్రాలకు సంబంధించి తాజాగా విన్నర్స్‌ జాబితాను విడుదల చేశారు. గత పన్నేండేళ్లుగా కొనసాగుతున్న ఈ అవార్డుల వేడుకగా తాజాగా 13వ వసంతంలోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్‌ 5న మొదటిరోజున తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డుల వేడుక జరిగింది.  సెప్టెంబర్‌ 6న తమిళ్‌,మలయాళం ఇండస్ట్రీకి చెందిన కార్యక్రమాలు జరుగుతాయి. 

సైమా అవార్డ్స్‌-2025లో 'పుష్ప2' చిత్రం పంట పండింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌, ఉత్తమ నటిగా రష్మిక మందన్నా, ఉత్తమ దర్శకుడిగా సుకుమారు, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ అవార్డ్స్‌ దక్కించుకున్నారు. అయితే, ఉత్తమ చిత్రంగా 'కల్కి' నిలిచింది.


సైమా విజేతలు.. వారి వివరాలు

* ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ
*  ఉత్తమ దర్శకుడు: సుకుమార్‌ (పుష్ప-2)
*  ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్‌): ప్రశాంత్‌ వర్మ (హనుమాన్‌) 
*  ఉత్తమ నటుడు: అల్లు అర్జున్‌ (పుష్ప-2) 
*  ఉత్తమ నటి : రష్మిక మందన్నా (పుష్ప-2)
*  ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): తేజా సజ్జా  (హనుమాన్‌)
* ఉత్తమ నటి  (క్రిటిక్స్‌): మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్‌) 
* ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్‌ బచ్చన్‌ (కల్కి) 
* ఉత్తమ సహాయ నటి: అన్నా బెన్ (కల్కి) 
* ఉత్తమ నూతన నటి : భాగ్యశ్రీ బోర్సే (మిస్టర్ బచ్చన్)
* ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప -2)
*  ఉత్తమ గేయ రచయిత 'చుట్టమల్లే' పాట కోసం: రామజోగయ్య శాస్త్రి (దేవర)
* ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్: శిల్పారావ్‌ (దేవర) 'చుట్టమల్లే' పాట కోసం
* ఉత్తమ గాయకుడు:  శంకర్ బాబు కందుకూరి (పుష్ప2) 'పీలింగ్స్' పాట
* ఉత్తమ విలన్‌ : కమల్ హాసన్ (కల్కి) 
* ఉత్తమ సినిమాటోగ్రాఫర్: రత్నవేలు (దేవర)  
*  ఉత్తమ హాస్యనటుడు: సత్య (మత్తు వదలరా 2) 
*  ఉత్తమ నూతన నిర్మాత : నిహారిక కొణిదెల (కమిటీ కుర్రోళ్లు)
*  ఉత్తమ నూతన నటుడు:  సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోళ్లు)
* ఉత్తమ నూతన దర్శకుడు: నందకిషోర్‌ ఇమాని (35 ఒక చిన్నకథ)
*  ప్రైడ్‌ ఆఫ్‌ తెలుగు సినిమా : అశ్వినీదత్ (వైజయంతీ మూవీస్‌ 50 ఏళ్లు పూర్తి) 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement