
దుబాయ్ యువరాణి షేకా మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్(31) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. సరిగ్గా ఏడాది క్రితం మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమె ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుని వార్తల్లో నిలిచారు.

అమెరికన్ రాపర్ 'ఫ్రెంచ్ మోంటానా'(41)తో మహ్రా కొంతకాలంగా ప్రేమలో ఉంది. తాజాగా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు రాపర్ ప్రతినిధి ధృవీకరించారు. ఈ సంవత్సరం జూన్‌లో పారిస్ ఫ్యాషన్ వీక్ సందర్భంగా నిశ్చితార్థం జరిగిందని క్లారిటీ ఇచ్చారు. అయితే, ఆ విషయాన్ని ఇప్పటి వరకు రహస్యంగానే ఉంచినట్లు తెలిపారు. రాపర్ 'ఫ్రెంచ్ మోంటానా' కంటే ఆమె వయసులో సుమారు పదేళ్లు చిన్నది. పెళ్లి తేదీ, ఇతర విషయాలు ఇంకా ప్లాన్ చేయలేదని చెబుతున్నారు. కానీ, ఈ జంట ఇరువురి కుటుంబాలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాయని సమాచారం.

షేక్ మహ్రా ఎవరు.. మొదటి భర్తతో విడాకులకు కారణం..?
దుబాయ్ పాలకుడు, యూఏఈ ప్రధానమంత్రి 'షేకా మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్' కుమార్తె 'షేకా మహ్రా' బ్రిటన్‌లో చదువుకున్న ఆమె 2023 మే నెలలో దుబాయ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త 'షేకా మనా బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్'ను పెళ్లి చేసుకున్నారు. వారికి తొలి సంతానం కలిగిన రెండు నెలలకే విడిపోతున్నట్లు 2024 జులైలో ప్రకటించారు. తన భర్త ఇతరుల సహచర్యం కోరుకున్నందున తాను విడాకులు తీసుకుంటున్నట్లు ఆమె చెప్పారు. 'ఐ డైవర్స్ యూ.. టేక్ కేర్..' మీ మాజీ భార్య అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు.
ప్రస్తుతం తన కుమార్తెతో షేకా మహ్రా ఉంది. ఇప్పుడు ప్రేమించి మరో పెళ్లి చేసుకోనున్నడంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే.., రాపర్ 'ఫ్రెంచ్ మోంటానా' ప్రతినిధి ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారని ధృవీకరించినప్పటికీ, వారిద్దరు మాత్రం దాని గురించి ఎటువంటి అధికారిక ప్రకటనను పంచుకోలేదు.