ప్రధాని మోదీకి దర్శకధీరుడు విషెస్.. వీడియో రిలీజ్ | SS rajamouli and Mahesh Babu Special birthday Wishes to PM Narendra Modi | Sakshi
Sakshi News home page

SS rajamouli: ప్రధాని మోదీకి దర్శకధీరుడు విషెస్.. వీడియో రిలీజ్

Sep 17 2025 5:05 PM | Updated on Sep 17 2025 5:09 PM

SS rajamouli and Mahesh Babu Special birthday Wishes to PM Narendra Modi

మనదేశ ప్రధాని నరేంద్రమోదీకి టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి విషెస్ తెలిపారు. ఇవాళ మోదీ బర్త్డే కావడంతో ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 75 ఏళ్ల వయసులోనూ మీరు 50 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తున్నారని ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఇండియాకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారని అన్నారు. వరల్డ్వైడ్గా బలమైన స్థానంలో నిలబెట్టారని కొనియాడారు. మీరు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, శక్తి, ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నానని వీడియోను పోస్ట్చేశారు.

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు సైతం ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మీ నిబద్ధత, జీవితం గురించి చూస్తే రాబోయే తరాలకు ఆదర్శమని కొనియాడారు. దేశం కోసం మీరు చేస్తున్న కృషి ప్రతి భారతీయుడని గర్వపడేలా చేసిందన్నారు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని.. మీ నాయకత్వంతో మా అందరికీ స్ఫూర్తినిస్తూ కొనసాగాలని కోరుకుంటున్నాని వీడియో రిలీజ్ చేశారు.

కాగా.. మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో భారీ యాక్షన్ అడ్వెంచరస్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలిసారి వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement