రాముడిగా..? | SS Rajamouli Next Film with Mahesh Babu Titled Gen 63 | Sakshi
Sakshi News home page

రాముడిగా..?

Sep 7 2025 12:34 AM | Updated on Sep 7 2025 12:34 AM

SS Rajamouli Next Film with Mahesh Babu Titled Gen 63

మహేశ్‌బాబు వెండితెరపై రాముడిగా కనిపించనున్నారట. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫారెస్ట్‌ యాక్షన్‌ అడ్వెంచరస్‌ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కెన్యా దేశంలోని నైరోబీలో జరుగుతోంది. ఇటీవల మొదలైన ఈ లాంగ్‌ షూటింగ్‌ షెడ్యూల్‌ నెల రోజులకు పైనే ఉంటుందట. అయితే చిన్న గ్యాప్‌ రావడంతో ప్రస్తుతం మహేశ్‌బాబు హైదరాబాద్‌ చేరుకున్నారని, త్వరలోనే మళ్లీ నైరోబీకి వెళ్తారనే టాక్‌ వినిపిస్తోంది. 

కాగా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఈ చిత్రానికి ‘జెన్‌ 63’ అనే టైటిల్‌ను మేకర్స్‌ పరిశీలిస్తున్నారనే టాక్‌ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కథనం విభిన్న కాల మానాల్లో జరుగుతుందని, ఇందులో భాగంగా కొన్ని సన్నివేశాల్లో రాముడి పాత్రలో మహేశ్‌బాబు కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో కేఎల్‌ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 120కి పైగా దేశాల్లో ఈ చిత్రం 2027లో విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement