
దీపావళి వచ్చిందంటే చాలు.. సినీతారల సందడి మామూలుగా ఉండదు. కుటుంబంతో కలిసి ప్రతి ఒక్కరూ ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. టాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ దీపావళిని స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పండుగ టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ దంపతులకు మరింత ప్రత్యేకంగా నిలిచింది. తమ ముద్దుల వారసుడితో కలిసి దీపావళిని జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కాగా.. మెగా హీరో వరుణ్ తేజ్ రెండేళ్ల క్రితమే హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని నెలల క్రితం తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 10న ఈ జంటకు బాబు పుట్టాడు. ఇటీవలే బారశాల వేడుక కూడా నిర్వహించారు. వరుణ్-లావణ్య దంపతులు తమ వారసుడి పేరుని బయటపెట్టారు. హనుమంతుడి పేర్లలో ఒకటైన వాయుపుత్రని స్పూర్తిగా తీసుకుని 'వాయువ్ తేజ్' అని నామకరణం చేశారు.
కాగా.. నాగబాబు కొడుకుగా వరుణ్ తేజ్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. 'ముకుంద' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఫిదా, కంచె, తొలిప్రేమ, ఎఫ్ 2 తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో తనతో పాటు కలిసి నటించిన లావణ్య త్రిపాఠితో దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నాడు. ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచారు. 2023లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు.