అందుకే అల్లు అర్జున్‌ టాప్‌లో ఉన్నాడు.. నిర్మాత ఎస్‌కేఎన్‌ కామెంట్స్ | SKN Comments on Tollywood Hero Allu Arjun At K-Ramp Event | Sakshi
Sakshi News home page

SKN: అందువల్లే అల్లు అర్జున్‌ టాప్‌లో ఉన్నాడు.. నిర్మాత ఎస్‌కేఎన్‌ కామెంట్స్

Oct 21 2025 4:19 PM | Updated on Oct 21 2025 4:30 PM

SKN Comments on Tollywood Hero Allu Arjun At K-Ramp Event

టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపించారు. కిరణ్ అబ్బవరం నటించిన కె ర్యాంప్‌ బ్లాక్‌బస్టర్‌ మీట్‌లో పాల్గొన్న ఎస్‌కేఎన్‌ బన్నీని కొనియాడారు. ఈ రోజు అల్లు అర్జున్‌ ఈ స్థానంలో ఉన్నారంటే అదొక్కటే కారణమన్నారు.

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన రేసు గుర్రం సినిమా గురించి నిర్మాత ఎస్‌కేఎన్ ఈవెంట్‌లో ప్రస్తావించారు. ఈ చిత్రంలో బ్రహ్మనందం చివరి పది నుంచి పదిహేను నిమిషాల్లో ఎక్కువగా డామినేట్ చేశారని అన్నారు. కానీ ఆయన ఫుల్ డామినేట్ చేశారని ఆ రోజు అల్లు అర్జున్‌ ఫీలవ్వలేదని చెప్పారు. ఆ సినిమాకు ఏది వర్కవుట్‌ అవుతుందో అది మాత్రమే చూశాడు బన్నీ.  అందుకే ఈ రోజు బన్నీ టాప్‌ పొజిషన్‌లో ఉన్నారని నిర్మాత ఎస్‌కేఎన్‌ ప్రశంసలతో ముంచెత్తారు. కాగా.. యంగ్ హీరో కిరణ్ బ్బవరం నటించిన కె ర్యాంప్‌ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీ దీపావళి బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement