
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ మన శంకరవరప్రసాద్‌గారు (Mana Shankara Vara Prasad Garu Movie). అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి హిట్ కొట్టిన అనిల్ మరో బ్లాక్ బస్టర్ కోసం రెడీ అయిపోయాడు.
ఇటీవలే ఈ మూవీ నుంచి మీసాల పిల్ల అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌కు అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం ఈ పాట 30 మిలియన్ల వ్యూస్, 30 వేల రీల్స్, 300 మిలియన్ల రీల్స్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. అంతేకాకుండా అన్ని మ్యూజిక్ ఫ్లాట్‌ఫామ్స్‌లో 50 మిలియన్లకు పైగా ఈ పాటను ప్లే చేశారు.
కాగా.. ఈ రొమాంటిక్ సాంగ్‌కు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. ఈ పాటను ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ ఆలపించారు. ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ అందించారు. కాగా.. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.
There’s no stopping the MEGA GRACE of #ManaShankaraVaraPrasadGaru 🔥🔥🔥#MeesaalaPilla is trending #1 on YouTube with 30M+ Views, 30K+ Reels on insta, 300M+ Reel Views and 50M+ Plays across all music platforms 💥💥💥
AN UNANIMOUS MUSICAL SENSATION IN INDIA ❤️🔥❤️🔥❤️🔥
--… pic.twitter.com/6rqiuAUop5— Shine Screens (@Shine_Screens) October 21, 2025