రాజమౌళి- మహేశ్‌ మూవీ.. ఊహించని విలన్‌! | Mahesh Babu and SS Rajamouli SSMB 29 Movie Update | Sakshi
Sakshi News home page

SSMB 29: రాజమౌళి- మహేశ్‌ మూవీ.. ఊహించని విలన్‌!

Jul 20 2025 12:08 AM | Updated on Jul 20 2025 8:43 AM

Mahesh Babu and SS Rajamouli SSMB 29 Movie Update

మహేశ్‌బాబు హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ (వర్కింగ్‌ టైటిల్‌). రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌ ప్రియాంకా చోప్రా హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలకపాత్రలు చేస్తున్నారు. కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా కథ ఏంటి? షూటింగ్‌ ఎంత వరకూ వచ్చింది? వంటి విషయాలపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

అయితే ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ‘ఇండియానా జోన్స్‌’ స్టైల్‌ కథతో ఈ సినిమా రూపొందుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే... ఈ కథలో విలన్‌ ఎవరు? అనే విషయం సినిమా ముగిసేవరకూ ఊహించలేమట. పతాక సన్నివేశాల వరకు నెగెటివ్‌ రోల్‌ తెలియనివ్వకుండా ప్రేక్షకులను సస్పెన్స్‌ చేయనున్నారట రాజమౌళి. ఈ చిత్రంలో మాధవన్‌ కీలకపాత్రలో కనిపించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. దాంతో ఆయన విలన్‌గా కనిపించనున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement