
తెలుగు చిత్ర పరిశ్రమలో దీపావళి సందడి జోరుగా కనిపించింది. ఫస్ట్ లుక్, కొత్త పోస్టర్స్, రిలీజ్ డేట్స్, వీడియో గ్లింప్స్, ప్రెస్‌మీట్స్... ఇలా సినిమా లవర్స్‌కి కావల్సినన్ని అప్‌డేట్స్ ఇచ్చింది ఈ పండగ. ఆ విశేషాల్లోకి...
డేట్ ఫిక్స్
⇒ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన చిత్రం ‘కాంత’. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. తెలుగు, తమిళ భాషల్లో సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మించారు. ఈ సినిమాను నవంబరు 14న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు. 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో స్టార్ హీరో చంద్రన్‌గా దుల్కర్, దర్శకుడు అయ్యా పాత్రలో సముద్ర ఖని కనిపిస్తారు.
⇒ శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారి నారి నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
⇒ భూమిక చావ్లా ప్రధాన పాత్రలో, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత కీలక పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘యుఫోరియా’. గుణశేఖర్ దర్శకత్వంలో రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్త గుణ నిర్మించారు. ఈ సినిమాను డిసెంబరు 25న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
⇒ పతంగుల పోటీ నేపథ్యంలో రూపొందిన కామెడీ స్పోర్ట్స్ డ్రామా ‘పతంగ్’. వంశీ పూజిత్, ‘జీ సరిగమప’ రన్నరప్ ప్రణవ్ కౌశిక్, ఇన్‌స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి పగడాల ప్రధాన పాత్రధారులుగా, సింగర్ ఎస్పీ చరణ్ కీలక పాత్రలో నటించారు. ప్రణీత్ పత్తి పాటి దర్శకత్వంలో విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించారు. ఈ సినిమాను డిసెంబరు 25న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలి పారు.
అప్ డేట్స్
⇒ చిరంజీవి ఇంట్లో దీ పావళి సంబరాలు ఘనంగా జరిగాయి. హీరోలు నాగార్జున, వెంకటేశ్, సతీసమేతంగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో నీరజ (వెంకటేశ్ భార్య), అమల (నాగార్జున భార్య)లతో పాటు చిరంజీవి తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’లో హీరోయిన్‌గా నటిస్తున్న నయనతార కూడా పాల్గొన్నారు. ఈ వేడుకల్లోని ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. మరోవైపు చిరంజీవి, నయనతార హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సుస్మిత కొణిదెల, సాహు గార పాటి నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది.
⇒ విశాల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మకుటం’. ఈ సినిమా సెకండ్ లుక్‌ను రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమాకు తానే దర్శకత్వం వహిస్తున్నట్లుగా కూడా విశాల్ తెలి పారు. ‘‘పరిస్థితులు నన్ను ఈ సినిమాకు దర్శకత్వం వహించాలనే నిర్ణయం తీసుకునేలా చేశాయి. ఈ నిర్ణయం బలవంతం వల్ల కాదు, బాధ్యతగా తీసుకోవడం జరిగింది’’ అంటూ ఓ లాంగ్ నోట్‌ను విశాల్ షేర్ చేశారు. విశాల్‌కు దర్శకుడిగా ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో దుషారా విజయన్, అంజలి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ సినిమాకు తొలుత దర్శకుడిగా ఉన్న రవి అరసు ఇప్పుడు ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్‌బి చౌదరి నిర్మిస్తున్నారు.
⇒ హీరో వెంకటేశ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా రూ పొందనున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్నారు. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రలో శ్రీనిధి శెట్టి నటించనున్నారు. మంగళవారం (అక్టోబరు 21) శ్రీనిధి శెట్టి బర్త్ డే సందర్భంగా ఈ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటించనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా తెలి పారు.
⇒ నవీన్ పొలిశెట్టి, మీనాక్షీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’. మారి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా స్పెషల్ ్ర΄ోమో వీడియోను రిలీజ్ చేశారు చేశారు మేకర్స్. అలాగే త్వరలోనే ‘అనగనగా ఒక రాజు’ సినిమా నుంచి పాటను రిలీజ్ చేయనున్నట్లుగా కూడా తెలి పారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది.
⇒ ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫ్యాంటసీ ఎంటర్‌టైనర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ యేలేటి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్‌ఎస్ కార్తికేయ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ్ర పారంభమైంది. ‘‘తొలి షూటింగ్ షెడ్యూల్ నవంబరు 8 వరకు కొనసాగుతుంది. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.
ఫస్ట్ లుక్
⇒ మోటార్ సైకిల్ రేసర్‌గా హీరో శర్వానంద్ నటిస్తున్న చిత్రానికి ‘బైకర్’ టైటిల్ ఖరారు చేసి, లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. 1990, 2000ల నేపథ్యంలో రేసింగ్ డ్రీమ్స్, ఎమోషన్స్ ప్రధానంగా ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూ పొందుతోంది.
⇒ రష్మికా మందన్నా నటిస్తున్న ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మైసా’. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలోని రష్మిక లుక్ విడుదలైంది. గోండు తెగల నేపథ్యంలో ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూ పొందుతున్న ఈ చిత్రం గ్లింప్స్ త్వరలో విడుదల కానుంది.
⇒ సంయుక్త నటిస్తున్న తొలి ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్‌కి ‘ది బ్లాక్ గోల్డ్’ టైటిల్‌ని ఖరారు చేసి, లుక్‌ని విడుదల చేశారు. యోగేష్ ఏఎంసి దర్శకత్వంలో ఈ యాక్షన్ మూవీని రాజేశ్ దండ నిర్మిస్తున్నారు. హాస్య మూవీస్, మాగంటి పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్న ఆరవ సినిమా ఇది. ఈ చిత్రంలో నటించడంతో పాటు సంయుక్త సమర్పకురాలిగానూ వ్యవహరిస్తుండటం విశేషం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది.
⇒ ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో కీర్తన నరేశ్, టీఆర్ ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్న చిత్రం ‘కాగితం పడవలు’. వర్ధన్, కృష్ణప్రియ జటంగా నటిస్తున్న ఈ ప్రేమకథా చిత్రం గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఓ తీరంలో ప్రేమికులు మాట్లాడుకోవడంతో ఈ వీడియో సాగుతుంది. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది.
⇒ గ్రామీణ నేపథ్యంలో రూ పొందుతోన్న ఎమోషనల్ మూవీ. ‘రోలుగుంట సూరి’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. నాగార్జున పల్లా, ఆధ్యారెడ్డి, భావన నీలిపి హీరో హీరోయిన్లు. చక్కని భావోద్వేగాలతో, జీవిత సత్యాలు మిళితమైన కథతో అనిల్ కుమార్ పల్లా దర్శకత్వంలో సౌమ్య చాందిని పల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.