
కర్ణాటక: మైసూరు వద్ద సినిమా షూటింగ్‌లో ఉన్న సినీ నటుడు రామ్‌చరణ్ ఆదివారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. కొన్ని రోజులుగా మైసూరు నగరం చుట్టుపక్కల ‘పెద్ది’ సినిమా షూటింగ్ జరుగుతోంది. అందులో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం మైసూరులోని నివాసంలో సీఎం సిద్దరామయ్య ఉన్నట్లు తెలుసుకున్న రామ్‌చరణ్ వచ్చి ఆయన్ను కలిశారు. శాలువాతో సిద్దరామయ్యను సన్మానించి కొంతసేపు ముచ్చటించారు.