
ఫైల్ ఫొటో
Asia Cup 2025: ఆసియా కప్-2025 నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే టోర్నమెంట్‌కు సంబంధించి ఆసియా క్రికెట్ మండలి (ACC) శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.
మూడుసార్లు ఢీకొట్టే అవకాశం!
చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ (India vs Pakistan) జట్లు సెప్టెంబరు 14న పరస్పరం తలపడనున్నాయి. దాయాదులు రెండూ ఒకే గ్రూపులో ఉన్నాయి కాబట్టి సూపర్ ఫోర్ దశలో మరోసారి అంటే.. సెప్టెంబరు 21న ఢీకొట్టే వీలుంది. ఒకవేళ ఇరుజట్లు ఫైనల్ చేరితో సెప్టెంబరు 28న మరోసారి ముఖాముఖి పోటీపడతాయి.
గ్రూప్- ఎ నుంచి ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ పోటీపడనుండగా.. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ గ్రూప్-బి నుంచి తలపడతాయి. దుబాయ్, అబుదాది వేదికలుగా ఈ 19 మ్యాచ్‌ల టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు.
బీసీసీఐపై విమర్శలు
కాగా ఆసియా కప్ టీ20 టోర్నీకి ఈసారి భారత్ వేదిక. అయితే, ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గతంలో మాదిరి ఈసారి కూడా తటస్థ వేదికపై టోర్నీని నిర్వహించనున్నారు. అయితే, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో అన్ని స్థాయిల్లోనూ క్రీడల్లోనూ బంధం తెంచుకోవాలనే డిమాండ్లు వచ్చాయి. బీసీసీఐ సైతం దాయాదితో పోటీ పడేందుకు సుముఖంగా లేమని వెల్లడించింది.
కానీ.. తాజా షెడ్యూల్ ప్రకారం చిరకాల ప్రత్యర్థితో టీమిండియా తలపడనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై విమర్శలు వస్తున్నాయి. కాగా ఇటీవల వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడేందుకు ఇండియా చాంపియన్స్ నిరాకరించింది. దీంతో ఇరుజట్ల మధ్య మ్యాచ్ రద్దు కాగా.. చెరో పాయింట్ వచ్చింది.
లీగ్ దశ షెడ్యూల్
👉సెప్టెంబరు 9: అఫ్గనిస్తాన్ వర్సెస్ హాంగ్‌కాంగ్
👉సెప్టెంబరు 10: ఇండియా వర్సెస్ యూఏఈ
👉సెప్టెంబరు 11: బంగ్లాదేశ్ వర్సెస్ హాంగ్‌కాంగ్
👉సెప్టెంబరు 12: పాకిస్తాన్ వర్సెస్ ఒమన్
👉సెప్టెంబరు 13: బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక
👉సెప్టెంబరు 14: ఇండియా వర్సెస్ పాకిస్తాన్
👉సెప్టెంబరు 15: యూఏఈ వర్సెస్ ఒమన్
👉సెప్టెంబరు 15:శ్రీలంక వర్సెస్ హాంగ్‌కాంగ్
👉సెప్టెంబరు 17: పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ
👉సెప్టెంబరు 18: శ్రీలంక వర్సెస్ అఫ్గనిస్తాన్
👉సెప్టెంబరు 19: ఇండియా వర్సెస్ ఒమన్
సూపర్ 4 దశ
👉సెప్టెంబరు 20: గ్రూప్- బి టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (B1 Vs B2)
👉సెప్టెంబరు 21: గ్రూప్-ఎ టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (A1 vs A2)
👉సెప్టెంబరు 23: A2 vs B1
👉సెప్టెంబరు 24: A1 vs B2
👉సెప్టెంబరు 25: A2 vs B2
👉సెప్టెంబరు 26: A1 vs B1
👉సెప్టెంబరు 28: ఫైనల్.
చదవండి: IND vs AUS: ధావన్ ధనాధన్.. పఠాన్ విధ్వంసం.. యువీ మాత్రం విఫలం