దుబాయ్‌ లాంటి దేశం.. చాలా తక్కువ ఖర్చుతో వీసా | Bahrain Visa For Indians Starts At Just Rs 1168 | Sakshi
Sakshi News home page

దుబాయ్‌ లాంటి దేశం.. చాలా తక్కువ ఖర్చుతో వీసా

Sep 18 2025 7:19 PM | Updated on Sep 18 2025 8:10 PM

Bahrain Visa For Indians Starts At Just Rs 1168

దుబాయ్‌ అంటే చాలా మంది భారతీయ పర్యాటకులకు ఇష్టమైన గమ్యస్థానం. అయితే దుబాయ్ కు ప్రత్యామ్నాయంగా బహ్రెయిన్ దేశాన్ని చూస్తారు. ఇక్కడి వాతావరణం నిశ్శబ్దంగా, నిర్మలంగా ఉంటుంది. మనామాలో శతాబ్దాల నాటి కోటల పక్కన మెరిసే గాజు టవర్లను చూడవచ్చు. ఉదయం పూట సూక్ లో విక్రయించే ముత్యాలను బేరమాడి కొనుక్కోవచ్చు.  మధ్యాహ్నం బీచ్ ఐలండ్‌లో సేద తీరవచ్చు. సూర్యాస్తమయం సమయంలో అరేబియన్ గల్ఫ్ మెరుపులను చూడవచ్చు. కుటుంబాలతో వచ్చినా, జంటగా వచ్చినా లేదా వ్యాపార పనుల మీద వచ్చినా ఇక్కడి అందాలను ఆస్వాదించవచ్చు.

బహ్రెయిన్‌కు వీసా అవసరమా?
అవును.. బహ్రెయిన్‌ సందర్శనకు వీసా అవసరం. భారతీయ పాస్ పోర్ట్ హోల్డర్లు వీసా లేకుండా బహ్రయిన్‌లోకి ప్రవేశించలేరు. వీసా పొందడానికి 
రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. అవి ఒకటి ఈ-వీసా (ముందస్తుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి). మరొకటి వీసా ఆన్ అరైవల్ (అర్హత ఉన్నట్లయితే విమానాశ్రయం వద్ద పొందవచ్చు). రెండింటికీ చెల్లుబాటు అయ్యే పాస్ పోర్ట్, రిటర్న్ ఫ్లైట్ టికెట్‌, తగినంత నిధులు ఉండాలి. అయితే ఈ వీసాలపై అక్కడ పనిచేసుకోవడానికి మాత్రం అనుమతి ఉండదు.

ఆన్ లైన్ వీసా ఫీజులు
• 2 వారాల సింగిల్ ఎంట్రీ — 10.000 బెహ్రెయినీ దినార్లు (రూ.2,336)

• 3 నెలల మల్టిపుల్ ఎంట్రీ — 17.000 బెహ్రెయినీ దినార్లు (రూ. 3,972)

• 1 సంవత్సరం మల్టిపుల్ ఎంట్రీ — 45.000 బెహ్రెయినీ దినార్లు (రూ. 10,515)

ఆన్ అరైవల్ వీసా ఫీజులు
• 2 వారాల సింగిల్ ఎంట్రీ - 5.000 బెహ్రెయినీ దినార్లు (రూ. 1,168)

• 3 నెలల మల్టిపుల్ ఎంట్రీ — 12.000 బెహ్రెయినీ దినార్లు (రూ. 2,804)

ఈవీసాకు దరఖాస్తు ఇలా..

  • బహ్రెయిన్ అధికారిక వీసా పోర్టల్ (జాతీయత, పాస్ పోర్ట్ లు, నివాస వ్యవహారాలు)లో అర్హతను సరిచూసుకోండి

  • ఆన్ లైన్ దరఖాస్తును పూరించి పత్రాలను అప్ లోడ్ చేయండి. తగిన రుసుము చెల్లించండి.

  • ఆమోదం పొందాక కొన్ని రోజుల్లోనే ఈమెయిల్ ద్వారా అప్రూవల్ వస్తుంది.

వీసా ఆన్ అరైవల్

  • అన్ని పత్రాలతో బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోండి.

  • వీసా కౌంటర్ వద్దకు వెళ్లి ఫీజు చెల్లించండి.

  • వేలిముద్రలు లేదా ఫోటో వంటి బయోమెట్రిక్ తనిఖీలు చేయించుకోండి.

  • కస్టమ్స్ క్లియర్ చేసి లగేజీని తీసుకోండి.

  • చాలా ఈవీసాలు ౩ నుండి 5 రోజుల్లో ప్రాసెస్ చేస్తారు. ఆన్-అరైవల్ వీసాలు మాత్రం అదే రోజు మంజూరు చేస్తారు.

బహ్రయిన్ సందర్శించడానికి మంచి సమయం

  • బహ్రయిన్‌ ఎడారి దేశం కాబట్టి ఇక్కడ సమయం ముఖ్యమైనది.

  • డిసెంబర్ నుండి మార్చి వరకు ఉత్తమ సీజన్. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

  • జూలై, ఆగస్టు నెలల్లో, ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు వెళ్లకపోవడం మంచిది.

  • రంజాన్, ఈద్ వ్యాపార సమయాలు హోటల్ రేట్లు, రెస్టారెంట్ షెడ్యూల్ ను ప్రభావితం చేస్తాయి. కాబట్టి తదనుగుణంగా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement