
ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని ఈనెల 8న దుబాయ్‌లోని కరామా పార్క్‌లో ఘనంగా నిర్వహించారు. యుఏఈ వైయస్సార్సీపీ టీమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సయ్యద్ అక్రమ్, అరుణ్ చరవర్థి, ప్రేం, యండ్రా సేను, షేక్ అబ్దుల్లా కీలకంగా వ్యవహరించారు. వైఎస్సార్ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పణతో కార్యక్రమాన్నిప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి మహానేత సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో భాగంగా కార్మికులకు అన్నదానం చేశారు. కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని వైఎస్సార్ సేవా తత్వాన్ని గౌరవంగా స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా సయ్యద్ అక్రమ్, అరుణ్ చరవర్థి మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్సార్ సామాజిక న్యాయం, సంక్షేమాన్ని సమన్వయం చేసిన అజరామర నాయకుడని కొనియాడారు. ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చిన నాయకుని సేవలను సేవా కార్యక్రమాల ద్వారా గుర్తుచేసుకోవడం గర్వకారణమని అన్నారు.
ప్రధాన, గౌరవ అతిథులు డాక్టర్ ఖాజా అబ్దుల్ ముత్తలిబ్ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & ప్రైవేట్ అడ్వైజర్ — H.H. శైఖా సలామా తహ్మూన్ అల్ నాహ్యాన్ కార్యాలయం – యుఏఇ), నజీరుద్దీన్ మహమ్మద్ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, Spread Kindness) హాజరయ్యారు. పి. రావు, అబ్దుల్ ఫహీమ్, షోయబ్, అబ్దుల్ రఫీక్, షామ్, ఘానీ, సిరాజ్, షేక్ సమీర్, రవి, పిల్లి రవి, కె. ప్రసాద్, జో బాబు, కిషోర్, బాబ్జీ, ప్రభాకర్, చిట్టి బాబు, నరేశ్, మహిళా సభ్యులు.. శాంతి, రాణి, ప్రభావతి, చిన్ని, విజయ, మేరీ, రాజేశ్వరి, సునీత, వనిత, కమల, భారతీ తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ వైఎస్సార్ సేవా విలువలు, ఆశయాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలన్న సంకల్పంతో.. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత ఉత్సాహంగా కొనసాగిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు.
వైఎస్సార్ వల్లే ఎదిగా..
డాక్టర్ వైఎస్సార్ ప్రవేశపెట్టిన పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంతో లబ్ధి పొంది దుబాయ్‌లో స్థిరపడిన షేక్ సమీర్ ఈ సందర్భంగా తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. ''ఫీజు రీయింబర్స్‌మెంట్ వల్లే నేను ఇంజినీరింగ్ చదవగలిగాను. ఈ విద్యార్హత ఆధారంగా ఇన్ఫోసిస్, విప్రో, క్యాప్‌జెమినీ, డెలాయిట్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల్లో పనిచేశాను. ఆరోగ్యం, టెక్నాలజీని కలిపే వినూత్న ఆలోచనతో ఏఐ ఆర్కిటెక్ట్, Fit Techies LLC అనే సంస్థను స్థాపించి నడుపుతున్నాను. ఈ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఫిట్‌నెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి బోధిస్తున్నా. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం నా జీవితాన్ని మార్చింది. నేను విద్యార్థి నుంచి మార్గదర్శకుడిగా మారిన ప్రయాణానికి ఇది మూలకారణం” అన్నారు సమీర్.